రొటీన్‌కు భిన్నంగా హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణ ఎన్నికలైనా.. ఉపఎన్నికైనా రోడ్‌షోలు.. బహిరంగ సభలు కామన్. ఈ రెండు లేకుండా సాగుతోంది హుజురాబాద్ బైఎలక్షన్. నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోనూ సభలకు EC నో చెప్పడంతో ప్రత్యామ్నాయాలపై పడ్డాయి పార్టీలు. ఇంతకీ ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలపై పార్టీలు హ్యాపీగా ఉన్నాయా.. బాధపడుతున్నాయా? ఆంతరంగిక చర్చల్లో జరుగుతున్న సంభాషణలేంటి?
ఈసీ ఆంక్షలపై హుజురాబాద్‌లో చర్చ..!
Also Read
హుజురాబాద్‌లో ఈ నెల 30న పోలింగ్.. 27తో ప్రచారం ముగింపు. ప్రచారానికి మిగిలి ఉన్న ఈ కొద్దిరోజులనే కీలకంగా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే హుజురాబాద్‌ను చుట్టేసిన టీఆర్ఎస్, బీజేపీలు.. పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టాయి. అయితే ఓటర్ల అటెన్షన్ తీసుకొచ్చేందుకు.. లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు సభలకు ప్లాన్ వేసినా EC చెక్ పెట్టింది. దీంతో ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలపై ప్రధాన పార్టీలలో చర్చ జరుగుతోంది.
రోడ్ షోలు లేవు.. వెయ్యి మందితోనే బహిరంగ సభ..!
కరోనా సమయంలో నిర్వహించిన ఎన్నికల్లో కొన్నిచోట్ల వైరస్ ఉద్ధృతికి ప్రచార సభలు.. రోడ్‌షోలు కారణమయ్యాయని విమర్శలు వెల్లువెత్తాయి. EC తీరుపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దాంతో ఈ నెల 30 నిర్వహించే ఉపఎన్నికపై ఆంక్షల కొరఢా ఝుళిపించింది ఎన్నికల కమిషన్. ప్రచారంలో కీలకంగా భావించే రోడ్ షోలను బ్యాన్ చేసింది. వెయ్యి మందితోనే బహిరంగ సభ పెట్టుకోవాలి. ఒక పెద్ద నేతను తీసుకొచ్చి రోడ్ షోలు లేకుండా.. వెయ్యి మందితో సభ అంటే తేలిపోతుంది. అందుకే ఇంటింట ప్రచారానికి.. ఇతర మార్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి పార్టీలు.
హుజురాబాద్‌లో ఆనుకుని ప్రాంతాల్లోనే సభలకు బ్రేక్..!
షెడ్యూల్ రాకముందే హుజురాబాద్‌లో దళితబంధు పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించి.. టీఆర్ఎస్ ప్రచారానికి కిక్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఈ నెల 27న హుజురాబాద్‌కు ఆనుకుని ఉండే పెంచికల్‌పేటలో భారీ సభకు ప్లాన్ చేసినా.. ఈసీ కొత్తగా జారీ చేసిన ఆదేశాలతో ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టింది అధికారపార్టీ. హుజురాబాద్‌లో ప్రజాసంగ్రామయాత్ర మొదటి విడతను ముగించి భారీ సభకు ప్లాన్ చేసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా నాడు ఎన్నికల కోడే అడ్డంకిగా మారింది. దాంతో హుస్నాబాద్‌లో సభ నిర్వహించి మమ అనిపించారు. అప్పట్లో హుజురాబాద్‌కు ఆనుకున్న ప్రాంతాల్లో కోడ్‌పై ఆదేశాలు లేకపోవడంతో బీజేపీ సభకు ఆటంకం లేకుండా పోయింది. ఇప్పుడు వారికీ లేదు.. వీరికీ ఛాన్స్ లేదు.
ఈసీ తమ నెత్తిన పాలు పోసిందని నేతలు సంతోషం..!
సాధారణంగా పెద్ద నేతల రోడ్ షో లేదా బహిరంగ సభ అంటే భారీగా జనసమీకరణ చేయాలి. బోల్డంత ఖర్చు చేయాలి. EC పుణ్యమా అని నాయకులకు ఇప్పుడా బాధ తప్పింది. ఖర్చు మిగిలింది. అలా మిగిలిన ఖర్చును ఉపఎన్నికలో ఇంకోలా వినియోగించే వెసులుబాటు పార్టీలకు చిక్కింది. పైకి సభలు, రోడ్ షోలు లేవని నేతలు విచారం వ్యక్తం చేస్తున్నా.. ఆంతరంగిక సమావేశాల్లో మాత్రం ఎన్నికల సంఘం తమ నెత్తిన పాలు పోసిందని సంతోష పడుతున్నారట. అందుకే ఈసీ ఆంక్షలు.. వాటివల్ల కలుగుతున్న ఆనందాలపై రాత్రయ్యే సరికి ఆసక్తిగా చర్చించుకుంటున్నారట.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!