డిల్లీ – కంచ గచ్చిబౌలి అడవుల నరికివేతపై సుప్రీం కోర్టులో విచారణ. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అడవుల నరికివేతను సుమోటోగా విచారించిన సుప్రీం కోర్ట్. పర్యావరణాన్ని, వన్య ప్రాణులను రక్షించేలా ప్రతిపాదనలు రెడీ చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. గతంలో కంచ గచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి కోసం రాత్రికి రాత్రి వందల బుల్డోజర్లతో అడవులను నాశనం చేస్తారా అంటూ సుప్రీం కోర్ట్ మండిపడింది. అంతేకాదు వెంటనే విద్వంసం ఆపేయాలని ఆదేశించింది.…
CM Revanth Reddy : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కార్యాలయం తరఫున ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. “ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుంది” అని సీఎం స్పష్టంగా తెలిపారు. OnePlus 13s: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 50MP + 50MP కెమెరా, 4K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్స్‌తో వచ్చేసిన…
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలైన హరిత హారం కార్యక్రమం రాష్ట్రంలో హరిత విప్లవాన్ని సృష్టించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో గ్రీన్ కవర్ 24% నుంచి 31%కి పెరిగిందని.. అంటే 7.7% వృద్ధిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మొత్తం 250 కోట్ల మొక్కలు నాటి, రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ దని కొనియాడారు. తాము మేం కేవలం ఆకుపచ్చని తెలంగాణ గురించి మాట్లాడలేదని..…
కైకలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో కొల్లేరు నాయకులు, ప్రజలతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న తరుణంలో కొల్లేరు నేతలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. గడిచిన 25 ఏళ్ళ నుంచి పర్యావరణ వేత్తలు పర్యావరణం తప్ప మనుషుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. కొల్లేరులో పక్షులు బతకాలి.. మనుషులు కూడా ముఖ్యమే అని తెలిపారు. మొదటి సారి ప్రజల మనుగడ గురించి హస్తినకు తెలియజేసిన ఘనత…
Kancha Gachibowli: తెలంగాణలో గచ్చిబౌలి భూముల విషయంలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా కేంద్ర సాధికారిక కమిటీ (సీఈసీ) ఒక కీలక నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో పలు సూచనలు, సిఫార్సులతో పాటు పర్యావరణం, అడవుల పరిరక్షణపై గాఢమైన దృష్టిని వెల్లడించింది. గచ్చిబౌలి భూముల్లో అటవీ లక్షణాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ చేసిన సీఈసీ, తుది నివేదిక కోసం అటవీ సర్వే అనంతరం నాలుగు వారాల గడువు కోరింది. సీఈసీ నివేదిక ప్రకారం, హైకోర్టు ఆదేశాలు ఇచ్చేవరకు గచ్చిబౌలి…
KTR: తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు కేటీఆర్ బహిరంగ లేఖ రాసారు. ఇక ఇందులో తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కొత్త సమస్యలు సంభవిస్తున్నాయని.. ఈ తరుణంలో రాష్ట్ర ఆర్థిక లాభాలను పరిగణలోకి తీసుకుని పర్యావరణంపై దాడులు జరగడం చాలా దారుణ పరిస్థితిని సృష్టిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడడంతో పాటు 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు మరియు 10 క్షీరదాల జీవ ఆవాసంని నాశనం చేసే…
మూసీ పరిసరాల్లో నిర్మాణాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పురపాలక శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం.. మూసీ నది పరిసరాల్లో నిర్మాణ అనుమతులపై కఠిన నియంత్రణలు అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి నాలుగు మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మూసీకి 50 మీటర్ల పరిధిలో బఫర్ జోన్ కల్పించి, ఆ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే, 50 నుంచి 100 మీటర్ల మధ్య ప్రాంతంలో కొత్తగా…
Raghunandan Rao : ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ధర్నా నిర్వహించారు. HCU భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. HCU భూముల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ఎకరా భూమి 80 – 100 కోట్ల రూపాయలు ఉందన్నారు బీజేపీ ఎంపీలు. విద్యార్దులు ఉద్యమాలు చేస్తుంటే పోలీసులను ఉసి గోల్పి జైళ్ళ పాలు చేస్తుందని, విశ్వ విద్యాలయ భూమిని నాశనం చేస్తూ పర్యావరణానికి నష్టం కలగజేస్తున్నారని బీజేపీ ఎంపీలు వ్యాఖ్యానించారు. ఎంపీ…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని తాజ్ ట్రాపెజియం జోన్‌లో అక్రమంగా చెట్ల నరికివేత అంశంపై సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించింది. నరికివేయబడిన ప్రతి చెట్టుకు ఒక వ్యాపారవేత్తకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ వ్యాపారవేత్త మొత్తం 454 చెట్లను నరికివేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.