CM Revanth Reddy : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కార్యాలయం తరఫున ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. “ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుంది” అని సీఎం స్పష్టంగా తెలిపారు.
ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ “ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ”గా ఉన్న నేపథ్యంలో, ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించే దిశగా కృషి చేయాలని, దానికి సంబంధించి ప్రతిజ్ఞ చేయాలని సీఎం కోరారు. సహజ వనరుల సంరక్షణకు ప్రతిసారీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, రాబోయే తరాల కోసం ఈ వనరులను నిలుపుదల చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు.
ఈ సందర్బంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఓ ప్రకటనను విడుదల చేశారు. “చెట్లను పెంచాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. మన ఆరోగ్యం కోసం కాదు, మన భవిష్యత్ తరాల భద్రత కోసమూ పర్యావరణాన్ని కాపాడాలి,” అంటూ ఆమె పిలుపునిచ్చారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న వేళ, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వన మహోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ఏడాది అనుభవాల నేపథ్యంలో, ఈసారి మరింత విస్తృతంగా చెట్ల నాటే కార్యక్రమాలను చేపట్టేందుకు మంత్రి సురేఖ అధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు.
High Court: తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నాలుగు ప్రశ్నలు..!