డిల్లీ – కంచ గచ్చిబౌలి అడవుల నరికివేతపై సుప్రీం కోర్టులో విచారణ. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అడవుల నరికివేతను సుమోటోగా విచారించిన సుప్రీం కోర్ట్. పర్యావరణాన్ని, వన్య ప్రాణులను రక్షించేలా ప్రతిపాదనలు రెడీ చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. గతంలో కంచ గచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి కోసం రాత్రికి రాత్రి వందల బుల్డోజర్లతో అడవులను నాశనం చేస్తారా అంటూ సుప్రీం కోర్ట్ మండిపడింది. అంతేకాదు వెంటనే విద్వంసం ఆపేయాలని ఆదేశించింది. పర్యావరణాన్ని కాపాడకపోతే కంచె గచ్చిబౌలి లోనే తాత్కాలిక జైలు నిర్మించి, సిఎస్ తో పాటూ అధికారులను పెట్టాల్సి వస్తుందని చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ హెచ్చరించారు.
YS Jagan: ఇక ఎన్నికలు ఎందుకు.. గుద్దుకోవడమే
రాష్ట్రప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మనుసింఘ్వీ. అడవుల పరిరక్షణపై ఎటువంటి ఆందోళన అవసరం లేదన్నారు సింగ్వి.. అడవులు, చెరువులు, వన్యప్రాణుల రక్షణ కోసం విస్తృత ప్రణాళికను రెడీ చేస్తాం అన్నారు అభిషేక్ సింగ్వి. పర్యావరణ పరిరక్షణ కోసం మంచి ప్రతిపాదనను సిద్ధం చెయ్యాలని.. అలా చేస్తే గతంలో చేసిన కామెంట్స్ ను ఎత్తివేసి కాంప్లిమెంట్ ఇస్తామన్నారు చీఫ్ జస్టిస్.
Maharashtra: 15న మాంసం అమ్మకాలపై నిషేధం.. తప్పుపట్టిన అజిత్ పవార్