Supreme Court: పెద్ద ఎత్తన చెట్లు నరికి వేత.. ఒక్కో చెట్టుకు రూ.లక్ష జరిమానా!
- ఉత్తరప్రదేశ్‌లోని తాజ్ ట్రాపెజియం జోన్‌లో చెట్లు నరికివేత
- ఒక్కో చెట్టుకు రూ. లక్ష జరిమానా విధించిన సుప్రీం
- 454 చెట్లను నరికివేశారని వ్యాపారవేత్తపై ఆరోపణలు
- రూ.4 కోట్ల 54 లక్షల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని తాజ్ ట్రాపెజియం జోన్‌లో అక్రమంగా చెట్ల నరికివేత అంశంపై సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించింది. నరికివేయబడిన ప్రతి చెట్టుకు ఒక వ్యాపారవేత్తకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ వ్యాపారవేత్త మొత్తం 454 చెట్లను నరికివేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీని ప్రకారం.. అతను మొత్తం రూ.4 కోట్ల 54 లక్షలను జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ” చెట్లు నరికి వేయడం ఒకరిని హత్య చేయడం కంటే దారుణం” అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పర్యావరణానికి హాని కలిగించే వారి పట్ల దయ చూపడానికి వీళ్లేదని స్పష్టం చేసింది.
READ MORE: AP High Court: భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
“అనుమతి లేకుండా 454 చెట్లను నరికివేయడం ఖండించదగినది. ఈ పచ్చని ప్రాంతాన్ని తిరిగి సృష్టించడానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుంది.” అని జస్టిస్ అభయ్.ఎస్. ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణానికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC) నివేదిక ప్రకారం.. గత సంవత్సరం సెప్టెంబర్ 18 రాత్రి, బృందావన్ చటికారా రోడ్డులోని దాల్మియా ఫామ్ అనే ప్రైవేట్ భూమిలోని 422 చెట్లను, ప్రక్కనే రోడ్డు వెంట ఉన్న రక్షిత అటవీ ప్రాంతంలో 32 చెట్లను అక్రమంగా నరికివేశారు. ఈ మేరకు ఒక్కో చెట్టుకు రూ.లక్ష జరిమానా విధించింది. కంపెనీ యజమాని శివ శంకర్ అగర్వాల్ జరిమానా మొత్తాన్ని తగ్గించాలని కోర్టులో వాదించారు. నేను తప్పును అంగీకరించి క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఒకే దగ్గర కాకుండా సమీప ప్రాంతంలో మొక్కలు నాటడానికి అనుమతించాలని కోరారు. అతడి వాదనలు విన్న కోర్టు జరిమానాను తగ్గించడానికి నిరాకరించింది. కానీ సమీప ప్రాంతంలో చెట్లను నాటడానికి అనుమతించింది.
READ MORE: Murders: మూడు దారుణ హత్యలు.. లవర్స్ కోసం భర్తలను చంపిన కిల్లర్ భార్యలు..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..