మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రచార హోరు ముగిసింది. గత కొద్దిరోజులుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అభ్యర్థులంతా ఓటర్లను దర్శనం చేసుకున్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా.. మూడురోజుల పాటు జరిగిన సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం తెలిపింది. దీంతో ఈరోజు సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కాగా.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భావోద్వేగానికి లోనయ్యారు. శాసనసభ స్పీకర్గా శ్రీకాకుళం నుండి నాల్గవ వ్యక్తిగా పని చేసే అదృష్టం దక్కిందని తెలిపారు. సమావేశాల్లో ప్రతిసారి నిష్పక్షపాతంగా వ్యవహరించానని అన్నారు. ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించానని పేర్కొన్నారు.…
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రచారం చేయొద్దని సూచించారు. అంతేకాకుండా.. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయొద్దని తెలిపారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ప్రచారంలో దూసుకెళ్లిన అభ్యర్థుల మైకులు మూగబోయాయి. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఈ క్రమంలో.. రాష్ట్రంలో వైన్స్ షాపులు కూడా మూతపడనున్నాయి. 48 గంటల…
ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం ముగిసింది. వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. కృష్ణానదిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. మరికాసేపట్లో శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు కృష్ణానదిలో విహరించనున్నారు.
ఆదిలాబాద్ నుంచి ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మంలో ముగిసింది. 13 కి.మీ దూరంలో నిన్న బస చేసిన బట్టి.. ఇవాళ జనగర్జన సభకు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ముగించారు. 109 రోజులు.. 1360 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేపట్టారు. మరోవైపు జనగర్జన సభ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు.