తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రచారం చేయొద్దని సూచించారు. అంతేకాకుండా.. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయొద్దని తెలిపారు. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాతే ఒపీనియన్ పోల్ ప్రసారం చేయాలని చెప్పారు.
ఈవీయం ర్యాన్డ్ మైజేషన్ పూర్తి చేస్తామని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. ఈ 48 గంటలు చాలా కీలకమని.. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. పోలింగ్ సందర్భంగా అభ్యర్థికి ఒక వాహనానికే అనుమతినిచ్చారు. ఇదిలా ఉంటే.. రేపు ఈవీఎం, ఎన్నికల సామగ్రి పంపిణీ ఉంటుందని వికాస్ రాజ్ తెలిపారు. ఈవీఎంల పంపిణీ, రవాణాకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు వెళ్లొచ్చని పేర్కొన్నారు.
Mahesh Babu: పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడం ఎలా… మగాళ్ళకి మహేష్ అదిరిపోయే టిప్
ఈనెల 30వ తేదీ తెల్లవారుజామున 5.30కి మాక్ పోలింగ్ ఉంటుంది సీఈఓ వికాస్ రాజ్ చెప్పారు. హోమ్ ఓటింగ్ 27178 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని.. అందులో సీనియర్ సిటీజన్లు 15999 మంది ఉన్నారని తెలిపారు. ఈరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారని చెప్పారు. 7571 పోలింగ్ స్టేషన్లలో ఎక్కువ మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని.. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేశామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.