పోలీసుల కాల్పుల్లో ముగ్గురు గ్రామస్తులు మృతిచెందడం ఛత్తీస్‌గడ్‌లో కలకలం సృష్టిస్తోంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే… బీజాపూర్ జిల్లా సిల్గర్ గ్రామంలో పోలీసు బెటాలియన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా 3 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు గ్రామస్తులు.. తమ గ్రామంలో పోలీసు బెటాలియన్ ఏర్పాటు చేయొద్దని నిరసనకు దిగారు.. అయితే.. నిరసన కాస్త ఉద్రిక్తంగా మారిపోయింది… పోలీసులతో గ్రామస్తులు ఘర్షణకు దిగినట్టుగా తెలుస్తుండగా… ప్రతిఘటించడానికి కాల్పులకు దిగారు పోలీసులు.. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్తులు అక్కడిక్కడే మృతిచెందారు.. దీంతో.. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే, మావోలు గ్రామస్తుల మధ్య చేరి శిబిరంపై దాడి చేశారని.. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపటం జరిగిందని, పరస్పర కాల్పుల్లో కొంతమంది మావోయిస్టులు మరణించారని కూడా అక్కడ మీడియాకు ఐజీ చెప్పినట్టుగా సమాచారం.