ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరవు భత్యాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన కరువు భత్యాన్ని 2022 జనవరి నెల జీతంతో కలిపి విడుదల చేసేందుకు గానూ ప్రభుత్వం ఆమోదం తెలియచేసింది. జనవరి జీతంతో కలిపి మూడు విడతలుగా పెరిగిన కరవు భత్యం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా…
పీఆర్సీ, పెండింగ్ సమస్య పరిష్కారం ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన బాటపట్టాయి.. 70కి పైగా డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి.. వెంటనే పరిష్కారం చూపాలంటూ ఉద్యమాన్ని చేపట్టాయి.. అయితే, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ వచ్చిన ప్రభుత్వం.. తాత్కాలికంగా ఉద్యోగుల ఆందోళనకు బ్రేక్‌లు వేసింది.. పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి.. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ…
ఉద్యోగులకు 34 శాతం ఫిట్‌మెంట్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. కరోనా, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని.. ప్రస్తుతం ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ఇస్తున్నామన్నారు. ఉద్యోగుల గ్రాస్ వేతనం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సజ్జల. సీఎస్ కమిటీ సిఫార్సు చేసిన 14.29 ఐఆర్ ను అమలు చేస్తూ ఐఆర్ కు రక్షణ ఉండేలా చూస్తామని… రేపటికి పీఆర్సీ పై…
పీఆర్సీ పై పీటముడి వీడడం లేదు.. పీఆర్సీ, ఇతర 70 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుల సజ్జల నిన్న జరిపిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి.. అయితే.. ఇవాళ అంటే.. వరుసగా మూడో రోజూ కూడా చర్చలు కొనసాగనున్నాయి.. ఉద్యోగ సంఘాలతో మరో దఫా చర్చించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల.. ఫిట్‌మెంట్, మానిటరీ బెనిఫిట్స్ అమలు తేదీ తేలటమే కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు,…
ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారు. నేడు మాట మార్చుడు, మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు సీఎం జగన్ అంటూ మండిపడ్డారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న మాటకి రెండున్నరేళ్ళు అయినా దిక్కు లేదు. పైగా జగన్ కు అవగాహన లేకే సిపిఎస్ రద్దు చేస్తామనే హామీ ఇచ్చారంటూ స్వయంగా…
నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది తెలంగాణ హైకోర్టు.. 226 మంది ఉపాధ్యాయుల పిటిషన్‌పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.. రాష్ట్రపతి ఉత్తర్వులతో పాటు, గతంలోని కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జీవోలు ఉన్నాయని పిటిషనర్లు వాదించారు.. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.. ఇదే సమయంలో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు…
తెలంగాణలో ఉద్యోగుల విభజన మార్గదర్శకాల పై ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి టీజిఓ, టీఎన్జీవో నేతలు హాజరయ్యారు. సీనియారిటీ లిస్ట్ తయారు, ఉద్యోగుల కేటాయింపు పై చర్చ జరిగింది. రేపటి వరకు సీనియారిటీ లిస్ట్ తయారు చేయాలని ఆదేశించారు సీఎస్. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిని కేటాయించాలని కోరారు ఉద్యోగ సంఘాల నేతలు. భార్య భర్తలకు ఒకే దగ్గర…
ఉద్యమ కార్యాచరణకు సిద్ధం చేసే సమయంలో నేను మాట్లాడిన మాటలను కొందరూ తప్పుగా అన్వయించారని, ప్రభుత్వాన్ని గద్దె దించుతామని నేను అనలేదని ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నేను అనని మాటలను అన్నట్టుగా ట్రోల్ చేసి ఉద్యమం పక్కదారి పట్టించేందుకు కొన్ని మాధ్యమాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. నాలుగు గోడల మధ్య జరిగిన సమావేశంలో మాటలను బయట పెట్టి రాజకీయం చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమని బండి శ్రీనివాస్ అన్నారు.…
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో TGO మరియు TNGO ఎంప్లాయీస్ యూనియన్లతో రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారిగా వివిధ శాఖలు వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు పై సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు స్థానిక కేడర్ల వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై TGO, TNGO సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులందరికీ…