తెలంగాణలో ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్న జీవో 317ను రద్దు చేయాలని మావోయిస్టు సార్టీ లేఖ రాసింది. భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) తెలంగాణ కమిటీ లేఖ విడుదల చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు కొనసాగిస్తున్న బదిలీల ప్రక్రియను వెంటనే నిలిపి వేయాలి. స్థానికత, రిజర్వేషన్ల పై ఆధారపడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఖాళీగా వున్న పోస్టులను వెంటనే భర్తీ…
నూతన జోన్, జిల్లాలవారీగా ఉద్యోగుల కేటాయింపులు జరిగినప్పుడు స్థానికత ఆధారంగా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అంశాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఉమ్మడి కరీంనగర్‌లో జగిత్యాల కొత్త జిల్లాగా ఏర్పడిందన్నారు. జగిత్యాలలో ఉద్యోగం చేస్తున్న అతను ఇంకో జిల్లాకు కేటాయించారు. ఉద్యోగుల స్థానికతలో ఇబ్బందులు వస్తే పిల్లల స్థానికత కూడా మారుతుందన్నారు. Read Also: ఫాంహౌస్‌లో కూర్చోని రాత్రికి రాత్రే జీవోలు తెస్తారా..?…
కరీంనగర్‌లో రేపు రాత్రి 9 గంటల నుంచి 3 జనవరి ఉదయం 5 గంటల వరకు జాగరణ చేయాలని బీజేపీ నిర్ణయించిందని బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హజరవుతారని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు, పోలీసులకు, టీచర్లకు బదిలీలకు సంబంధించిన 317 జిఓ ఉద్యోగ సంఘాలతో చర్చించి సవరించాలని డిమాండ్ చేస్తు జాగరణ చేస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. Read…
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల్లో తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్‌కు మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నాని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏక్ నిరంజన్‌లా నిర్ణయాలు తీసుకుంటూ తుగ్లక్‌లా…
ఉపాధ్యాయ సంఘాలకు వైఎస్ షర్మిళ మద్దతు తెలిపారు. జీఓ317 రద్దు చేయాలని, జీఓ 317అంతా తప్పుల తడకగా ఉందని షర్మిళ అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలని తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఈ జీఓ స్థానికులనే స్థానికేతరులను చేసిందన్నారు. Read Also:విద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం మాదే: హరీష్‌రావు పుట్టిన ఊరు, చదువుకున్న ఊరు స్థానికత కాదని ఎలా చెప్తారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ లబ్దికోసం జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య పంచాయతీ పెడుతున్నారని చెప్పారు.…
ఓవైపు ఉద్యోగుల బదీలీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీస్తుంది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై హైకోర్టుకు వచ్చిన అప్పీళ్లపై స్పందించింది.కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు వివాదాలపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయుల పిటిషన్లపై విచారించిన హైకోర్టు దీనిపై ఉత్తర్వులు ఇస్తూ ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఉపాధ్యాయుల అప్పీళ్లను ప్రభుత్వానికి పంపించాలని డీఈఓలకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అప్పీళ్లను సమర్పించిన…
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టింగ్ లలో స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోవడం గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనో వేదనకు గురి చేస్తున్నాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో కోరారు. ఇంకా ఆయన ఈ లేఖలో రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, బదిలీల కోసం ప్రభుత్వం డిసెంబర్ 6న జీవో నెంబర్ 317ను జారీ చేసింది.…
ఏపీలో పీఆర్సీపై నెలకొన్న సందిగ్ధత వీడలేదు. అమరావతిలోని సచివాలయంలో ముగిసింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. వచ్చే వారం ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ జరిగే అవకాశం వుంది. ఆ తర్వాతే ఫిట్ మెంట్, ఇతర ఆర్థిక అంశాల పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా వుంటేఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస రావు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు సమావేశం అనంతరం మాట్లాడారు. మా 71 డిమాండ్ల పై అధికారులు…
తెలంగాణ రాష్ట్రలో ఉద్యోగ దంపతుల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రం వ్యాప్తంగా భార్యభర్తలు ఒకే చోట పని చేసేలా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. కొత్త జోనల్ కేటాయింపుల్లో చేరిన తర్వాతే ఉద్యోగుల్లో ఉండే భార్యభర్తలు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త జోనల్ వ్యవస్థ కేటాయింపులు అయిన తర్వాతే భార్య భర్తల బదిలీ విషయంలో ఆలోచిస్తామని…
కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండగా.. వ్యాక్సినేషన్‌తో చెక్ పెట్టేందుకు విస్తృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. ఇప్పటికే నో వ్యాక్సిన్.. నో ఎంట్రీ..! నో వ్యాక్సిన్.. నో సాలరీ..! నో వ్యాక్సిన్.. నో జర్నీ..! లాంటి నిర్ణయాలు తీసుకున్నాయి ఆయా సంస్థలు.. ఉద్యోగి మాత్రమే కాదు.. అతని కుటుంబసభ్యులు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటేనే జీతం ఇచ్చేది అంటూ పలు ప్రభుత్వ శాఖలతో పాటు.. కొన్ని ప్రైవేట్ సంస్థలు…