పీఆర్సీ సాధన సమితి, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.. కానీ, ఇప్పుడు పీఆర్సీ సాధన సమితి నాయకులు ప్రభుత్వ ప్రతిపాదనలకు తల ఊపిరావడంపై కొందరు ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు చర్చలు విఫలం అయ్యాయి.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.. కలసివచ్చేవారితో ఉద్యమం ఉంటుందంటున్నారు.. మరోవైపు.. ఈ వ్యవహారంపై కొందరు ఉద్యోగులుమండిపడుతున్నారు.. ఏకంగా పీఆర్సీ సాధన సమితి నాయకులకు పుష్పంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారంటే.. వారు…
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదానికి తెరపడింది.. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల చర్చలు సఫలం అయ్యాయి.. ఇక, ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉన్న దాంట్లో మేలు చేయగలిగితే ఉద్యోగులకు ఇంకా చేయాలని సీఎం చెప్పారన్న ఆయన.. అదనంగా భారం అయినా కూడా అధికారులు సీఎంతో మాట్లాడి అన్ని విషయాలు సర్దుబాటు చేశామన్నారు.. ఇంకా కొన్ని కోరికలు ఉన్న కూడా భవిష్యత్ లో దృష్టి పెడతామని హామీ ఇచ్చారు.. Read Also: యాదాద్రికి…
పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ఉద్యోగులు.. ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించారు.. విజయవాడలోని రోడ్లు.. ఉద్యోగులతో కిక్కిరిసిపోయాయి.. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. ఉద్యోగుల కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోయారు.. పెద్ద ఎత్తున అరెస్ట్ లు, నిర్బంధాలు కూడా వారిని ఆపలేకపోయాయి.. ఇక, ఛలో విజయవాడపై స్పందించిన స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాసరావు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఛలో విజయవాడకు లక్షలాదిగా ఉద్యోగులు తరలివచ్చారని తెలిపారు.. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఛలో విజయవాడను…
పీఆర్సీ విషయంలో ఆందోళన బాటపట్టిన ఉద్యోగులు.. ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు.. అయితే, సమ్మె విరమించండి.. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఉద్యోగులను కోరారు సీఎస్ సమీర్ శర్మ… మా కుటుంబంలో కోపం ఉంటే మాట్లాడుకుంటాం.. కొన్ని ఇబ్బందులు ఉంటాయి.. వాటి మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. అసలు సమ్మె చేస్తే ఏమి వస్తుందని ప్రశ్నించారు.. ఇప్పుడు ఇచ్చిన ఐఆర్ సుమారు 30 నెలల పాటు ఇచ్చాం.. ఐఆర్ అనేది ఇంట్రస్ట్ ఫ్రీ లోన్…
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వ్యవహారం రచ్చరచ్చగా మారిపోయింది.. ఆందోళనలో భాగంగా ఇవాళ ఛలో విజయవాడ నిర్వహించారు ఉద్యోగులు.. అయితే, ఉద్యోగుల ఆందోళనను ప్రభుత్వం తప్పుబడుతోంది.. ప్రభుత్వం ముందు నుంచి చర్చలకు సిద్ధం అని చెబుతూనే ఉన్నామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇటువంటి ఆందోళన వల్ల బహిరంగ ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది తప్ప ఉపయోగం ఉండదన్న ఆయన.. ఛలో విజయవాడ బల ప్రదర్శన చేయటం వంటిదే అని వ్యాఖ్యయానించారు.. కోవిడ్ పరిస్థితుల నుంచి పూర్తిగా కోలుకోలేదు.. ఉన్న పరిస్థితుల్లో…
పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నా.. నిర్బంధించినా.. ఛలో విజయవాడ విజయవంతం అయ్యిందని చెబుతున్నాయి ఉద్యోగ సంఘాలు.. ఇక, ఛలో విజయవాడపై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మాట్లాడుతూ.. ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం సక్సెస్.. ఇది సీఎం జగన్ నియంతృత్వానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.. ఉద్యోగులు కొత్తవి ఏమీ కోరడం లేదన్నారు.. పీఆర్సీ అమలు సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారితో చర్చలు జరపడం ఆనవాయితీ.. కానీ, పీఆర్సీ నివేదికను ఉద్యోగులకు సీఎం జగన్ ఎందుకు ఇవ్వడం…
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల ఉద్యమం ఉధృతం అవుతోంది.. ఇవాళ ఛలో విజయవాడ ఉద్రిక్తతలకు దారి తీసింది.. అయితే, ఉద్యోగుల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని.. అందుకే ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులేనని స్పష్టం చేసిన ఆయన.. చర్చలతోనే ఉద్యోగుల సమస్య పరిష్కారమవుతుందన్నారు.. కానీ, ఉద్యోగుల వెనుక చంద్రబాబు ఉన్నారు.. ఉద్యోగుల వెనుక ఆయన ఉన్నారు కాబట్టే.. సంఘాల నేతలు ఈ స్థాయిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని…
ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. ఉద్యోగుల పరస్పర బదిలీలకు (mutual transfers) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. బదిలీ కోరుకునే ఉద్యోగులు మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది సర్కార్.. ఇక, ఉద్యోగులు మ్యూచువల్ను వెతుక్కోవడానికి నెల రోజుల అవకాశం ఉంటుంది.. దీంతో, ఒక ప్రాంతంలో ఉద్యోగం చేయడం ఇష్టం లేని వారు.. మరో ప్రాంతంలో ఉద్యోగం…