ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల ఉద్యమం ఉధృతం అవుతోంది.. ఇవాళ ఛలో విజయవాడ ఉద్రిక్తతలకు దారి తీసింది.. అయితే, ఉద్యోగుల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని.. అందుకే ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులేనని స్పష్టం చేసిన ఆయన.. చర్చలతోనే ఉద్యోగుల సమస్య పరిష్కారమవుతుందన్నారు.. కానీ, ఉద్యోగుల వెనుక చంద్రబాబు ఉన్నారు.. ఉద్యోగుల వెనుక ఆయన ఉన్నారు కాబట్టే.. సంఘాల నేతలు ఈ స్థాయిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు… ధర్నా చేసుకున్నా.. సీఎం జగన్ ఉద్యోగులను ఏమీ అనలేదంటే.. ఉద్యోగులకు ఆయన ఇస్తున్న విలువను అర్థం చేసుకోవాలన్నారు నారాయణస్వామి.
మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో జీలుగు కల్లు మరణాలపై అధికారుల నుంచి సమాచారం తెప్పించినట్టు వెల్లడించారు నారాయణస్వామి.. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.. దీనిపై విచారణ చేపట్టామన్న ఆయన.. వ్యక్తిగత విబేధాల వల్లే జీలుగు కల్లు మరణాలు సంభవించాయని ప్రాథమిక విచారణలో తేలిందని ప్రకటించారు.. విషం లాంటి రసాయన పదార్థాలు జీలుగు కల్లులో కలిసినట్టు నివేదికల్లో స్పష్టం అవుతోందన్నా యన.. దీనిపై మరింత స్పష్టత త్వరలో వస్తుందన్నారు.. ఇక, చంద్రబాబు అన్నీ తెలుసుకుని మాట్లాడితే మంచిగా ఉంటుందని సూచించిన నారాయణస్వామి.. మద్యపానం నిషేధం ఉండాలా..? వద్దా..? అనేది చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.