తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్‌లు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను తీసుకునే పనిలో ఉంది. తాజాగా వయోపరిమితి సడలింపుపై తెలంగాణ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట అర్హత వయసును 44 ఏళ్లకు…
ఉద్యోగుల పరస్పర బదిలీలకు గాను ఈ నెల 15 తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. ఈ బదిలీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో సీనియారిటీ ప్రొటెక్షన్‌ను కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు.. ఈ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే జీవో ఎం.ఎస్. నెంబర్ 21 తేదీ 02.02.2022 విడుదల చేయడం జరిగిందని, ఈ జీవోలో పారా 7, 8 పారాల్లో పేర్కొన్న నిబంధనలను మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో…
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది.. అయితే, యుద్ధం కంటే ముందుగా.. సైబర్ దాడి రూపంలో ఉక్రెయిన్‌పై విరుచుకుపడినట్టు తెలుస్తోంది.. సైబర్ అటాక్‌లు, హ్యాకింగ్ చేయడంలో రష్యా సాంకేతిక పరిజ్ఞానం అపారం అనేది ఓపెన్ సీక్రెట్.. రష్యా సైబర్ దాడులతో ఉక్రెయిన్ బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది.. ప్రభుత్వ వెబ్ సైట్‌లు అన్నీ హ్యాక్ అయ్యాయి.. ఫలితంగా ఉక్రెయిన్ జనజీవనం స్తంభించి పోయింది.. ఏటీఎంల నుంచి కరెన్సీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా చేసినట్టు వార్తలు వచ్చాయి.. మరోవైపు…
వైద్యారోగ్య శాఖలో ఉద్యోగుల బదిలీల గడువును పొడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఉద్యోగుల బదిలీల గడువును మార్చి 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగులు ఫిబ్రవరి 25 తేదీ నుంచి మార్చి 3 తేదీ వరకు ఆన్‌లైన్‌లో బదిలీ అప్షన్లు ఇవ్వొచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం… ఇక, మార్చి 4 నుంచి 8 తేదీ వరకు సంబంధిత హెచ్‌వోడీల నేతృత్వంలో కౌన్సిలింగ్ జరుగుతుందని తన ఉత్తర్వుల్లో వైద్యారోగ్య శాఖ పేర్కొంది.. బదిలీ ప్రక్రియను…
ఉద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్.. జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రను కొనియాడారు… అందరి కృషివల్లే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందున్న ఆయన.. గతంలో కరెంట్ సమస్య ఉండేదని.. ఆ సమస్య లేకుండా చేశామని గుర్తుచేశారు.. ఇక, ఉద్యోగులు చిన్న చిన్న సమస్యలకు బెంబేలెత్తిపోవద్దని సూచించారు ముఖ్యమంత్రి.. తెలంగాణ ఉద్యమ సమయంలో అండగా నిలిచిన ఉద్యోగులను…
భాగ్యనగరంలో పోలీసులకు కొత్త సమస్య వచ్చిందా? సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనూ ఖాకీలకు తిప్పలు తప్పడం లేదా? జీవో 317ను తలుచుకుని ఇన్‌స్పెక్టర్లు.. పోలీస్ బాస్‌లు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇంతకీ ఖాకీలకు వచ్చిన పరేషాన్ ఏంటి? జీవో 317పై 3 కమిషనరేట్ల పరిధిలో దాదాపు 400 మంది ఎస్‌ఐలు రాకజీవో 317 సెగ పోలీసులను కూడా తాకింది. కాకపోతే అది నిరసన రూపంలో కాదు. ఆ జీవో ద్వారా భాగ్యనగరానికి వచ్చిన SIల ద్వారా.…
కరోనా కారణంగా చాలా కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చేశాయి. ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ఉద్యోగులు గత రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక ట్విట్టర్ సంస్థ తమ ఉద్యోగులకు జీవితకాలం వర్క్‌ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చేసింది. ఈ బాటలో మరో ఈ కామర్స్ సంస్థ మీషో కూడా పయనిస్తున్నది. మీషోలో పనిచేసే ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ను ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉద్యోగులు ఇకపై ఎక్కడి నుంచైనా పనిచేసుకునే వెసులుబాటును కల్పించింది. Read: వైరల్:…
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అటు టీడీపీ కూడా అధికార పార్టీని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షంగా చెప్పుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు వైసీపీ నేత సజ్జల. టీడీపీ నేత వినోద్ జైన్ వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు సజ్జల. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణి అవలభిస్తుంది అని పవన్ కళ్యాణ్ అంటున్నారు.ఆధిపత్య…
పీఆర్సీ విషయంలో విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం, ఉద్యోగులూ ఒకే టీం. సమస్యలు ఇరు పక్షాలకూ తెలుసు. కాబట్టి దీనిలో విజయం, వైఫల్యం అంటూ ఏమీ లేదన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆందోళనలు ప్రజాస్వామ్యంలో ఒక ఎక్స్‌ప్రెషన్ గానే ప్రభుత్వం చూసింది. రాష్ట్ర సొంత ఆదాయం రెండున్నర ఏళ్ళ కిందట ఉన్న దగ్గరే ఆగిపోయిందన్నారు సజ్జల. 80 వేల కోట్లకు పైగా ఆదాయం ఉంటే ఉద్యోగులు…
ఒమిక్రాన్ ఎంట్రీతో భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.. ఓ స్థాయిలో రోజువారి కేసులు మూడు లక్షలను కూడా దాటాయి.. దీంతో.. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలియి.. ఇప్పుడు మళ్లీ కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి.. రోజువారి కేసులు లక్షకు చేరువచ్చాయి.. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఎత్తివేసింది.. ఇవాళ్టి నుంచి ఉద్యోగులందరూ యథావిధిగా ఆఫీసులకు…