దయచేసి సమ్మె విరమించండి.. చర్చల ద్వారానే పరిష్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఆర్సీ విషయంలో ఆందోళన బాటపట్టిన ఉద్యోగులు.. ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు.. అయితే, సమ్మె విరమించండి.. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఉద్యోగులను కోరారు సీఎస్ సమీర్ శర్మ… మా కుటుంబంలో కోపం ఉంటే మాట్లాడుకుంటాం.. కొన్ని ఇబ్బందులు ఉంటాయి.. వాటి మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. అసలు సమ్మె చేస్తే ఏమి వస్తుందని ప్రశ్నించారు.. ఇప్పుడు ఇచ్చిన ఐఆర్ సుమారు 30 నెలల పాటు ఇచ్చాం.. ఐఆర్ అనేది ఇంట్రస్ట్ ఫ్రీ లోన్ లాంటిది.. దాన్ని సర్దుబాటు చేసుకోవాలని సూచించిన ఆయన.. తెలంగాణ తరహాలో డీఏలిచ్చి ఐఆర్ ఇవ్వకుంటే ఏపీకి రూ. 10 వేల కోట్లు మిగిలేదన్నారు.. కానీ, సీఎం జగన్ ఐఆర్ ఇవ్వాల్సిందేనన్నారు.. పే-స్లిప్పులన్నీ చూస్తే ఓవరాలుగా గ్రాస్ శాలరీ పెరిగిందని వివరించారు.
సమ్మె నోటీసును విరమించండి.. చర్చలకు రండి అంటూ మరోసారి ఉద్యోగా సంఘాలను ఆహ్వానించారు సీఎస్ సమీర్ శర్మ.. చర్చలు జరపకపోతే సమస్యలెలా తీరుతాయని ప్రశ్నించారు. నిరసనలు, ఆందోళనలతో ఉపయోగం ఉండదని, ఉద్యోగులతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కావాల్సింది ఏంటో చెబితే కూర్చొని మాట్లాడతామని తెలిపారు. మరోవైపు.. ఐఆర్ జీతంలో భాగం కాదు.. పాత-కొత్త పీఆర్సీల మధ్యలో ప్రభుత్వం ఇచ్చే ఆర్ధిక వెసులుబాటు మాత్రమే అన్నారు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్… ఉద్యోగులకు ఐఆర్ 27 శాతం మేర 30 నెలల పాటు ఇవ్వడం వల్ల రూ. 17918 కోట్లు ప్రభుత్వంపై భారం పడిందని వివరించారు.. ఐఆర్ అడ్జస్టుమెంటుపై జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కీలక వ్యాఖ్యలు.. ఐఆర్ అడ్జస్ట్మెంట్ అనేది ఒక్కొక్కరు ఒక్కో తరహా పదాన్ని వాడతారు.. ప్రభుత్వం సర్దుబాటు అంటుంది.. సామాన్యులు రికవరీ అంటారు.. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగికే డబ్బులు రావాల్సి ఉంటే ఎరియర్స్ అంటారు.. అదే ఉద్యోగి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటే నెగెటీవ్ ఎరియర్స్ అంటారని వెల్లడించారు.
Also Read
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
తాజావార్తలు
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!