ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదానికి తెరపడింది.. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల చర్చలు సఫలం అయ్యాయి.. ఇక, ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉన్న దాంట్లో మేలు చేయగలిగితే ఉద్యోగులకు ఇంకా చేయాలని సీఎం చెప్పారన్న ఆయన.. అదనంగా భారం అయినా కూడా అధికారులు సీఎంతో మాట్లాడి అన్ని విషయాలు సర్దుబాటు చేశామన్నారు.. ఇంకా కొన్ని కోరికలు ఉన్న కూడా భవిష్యత్ లో దృష్టి పెడతామని హామీ ఇచ్చారు..
Read Also: యాదాద్రికి సీఎం కేసీఆర్
ఫిట్మెంట్ పెంచడానికి ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా లేదన్నారు సజ్జల.. ఫిట్మెంట్ కాకుండా మిగిలిన అన్ని అంశాల్లో ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని.. ఆర్ధిక భారం పడినా హెచ్ఆర్ఏ, సీసీఏ అదనపు ప్రయోజనాలు పొందుతారని తెలిపారు. మరోవైపు.. ఉద్యోగ సంఘాలకు ఒక వేళ కొన్ని అభ్యంతరాలే ఉంటే రాత్రి చెప్పాల్సిందన్న ఆయన.. మినిట్స్ కూడా తయారయ్యాక బయటికి వెళ్లి మాట్లాడ్డం మంచిది కాదని హితవుపలికారు.. కొన్ని పట్టు విడుపులు ఉంటాయి.. కొన్ని సందర్భాల్లో సర్దుకుని వెళ్లాలని సూచించారు.. ఇక, ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకత చూపించడం.. చిన్న అపశృతిగా అభిప్రాయపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.