నిరసన టీకప్పులో తుఫాన్ లాంటిది.. ఉద్యోగుల్లో అసంతృప్తులు సహజం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఆర్సీ సాధన సమితి, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.. కానీ, ఇప్పుడు పీఆర్సీ సాధన సమితి నాయకులు ప్రభుత్వ ప్రతిపాదనలకు తల ఊపిరావడంపై కొందరు ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు చర్చలు విఫలం అయ్యాయి.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.. కలసివచ్చేవారితో ఉద్యమం ఉంటుందంటున్నారు.. మరోవైపు.. ఈ వ్యవహారంపై కొందరు ఉద్యోగులుమండిపడుతున్నారు.. ఏకంగా పీఆర్సీ సాధన సమితి నాయకులకు పుష్పంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారంటే.. వారు ఏ రేంజ్‌లో గుర్రుగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.. అయితే.. ఉద్యోగుల నిరసన టీకప్పులో తుఫాన్ లాంటిదన్నారు పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ… ఉద్యోగుల ఆందోళన, ఆవేశాలను మేం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. ఉద్యోగులు ఛలో విజయవాడ ద్వారా తమ అసంతృప్తిని తెలిపినందున ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించిందన్నారు.. అయితే, ఫిట్‌మెంట్ మినహా మిగిలిన అంశాల్లో ఎంతో కొంత పునరుద్ధరించారని సంతృప్తి వ్యక్తంచేసిన ఆయన.. ఫిట్‌మెంట్ విషయంలో ఆశించిన రీతిలో నిర్ణయం రాలేదన్నారు.
Read Also: ఉన్న దాంట్లో ఉద్యోగులకు ఇంకా చేయాలని సీఎం చెప్పారు-సజ్జల
Also Read
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
మరో 3 అంశాల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని తెలిపారు సూర్యనారాయణ.. కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ కాకుండా స్టేట్ పీఆర్సీకి రావడం మేజర్ అచీవ్మెంట్ గా తెలిపిన ఆయన.. వచ్చే ఏడాది పీఆర్సీని తీసుకువచ్చేలా పోరాటం చేశామన్నారు.. సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల్లో తీవ్ర మనోవేదన ఉంది.. మార్చి 31లోగా సీపీఎస్ రద్దుపై మంత్రుల కమిటీ రోడ్ మ్యాప్ ను తెలియజేస్తామన్నారని వివరించారు.. సీపీఎస్ రద్దు అంశంపై చాలా తక్కువ సమయంలో పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారన్న ఆయన.. ఏళ్ల తరబడి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం తెలిపారని.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు.. ఇక, ఫిట్‌మెంట్ తప్ప సీసీఎ, హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటం ఫించన్ పై ఆశాజనకంగా ఉంది.. మంత్రుల కమిటీని రెగ్యులర్ కమిటీగా మార్చాలని సీఎస్ ను సీఎం జగన్ ఆదేశించారు.. ఇకపై మేం కూడా మంత్రుల కమిటీతో సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తాం అన్నారు.. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తగ్గడం వల్లే ఆందోళనలు వచ్చాయని సీఎంకు తెలిపామని.. ఉద్యోగుల్లో చిన్న చిన్న అసంతృప్తులు ఉండటం సహజం.. రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం అన్నారు.. నెలకోసారి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అయ్యేందుకు సీఎం అంగీకరించి ఆదేశించారని తెలిపారు.. ఇక, టీచర్ ఎమ్మెల్సీల పదవుల కోసం ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడితే మేమేమీ చెప్పలేమన్న ఆయన.. ఉపాద్యాయ సంఘాలు సమావేశం నుంచి బయటకు వచ్చేందుకు ఏ రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయో తెలియదన్నారు.. టీచర్ల వల్ల మాత్రమే చలో విజయవాడ విజయవంతం కాలేదు.. అందరు ఉద్యోగుల వల్లే కార్యక్రమం విజయవంతమైందని స్పష్టం చేశారు.. హీరోయిజం కోసం ఉపాద్యాయ సంఘాలు ప్రవర్తిస్తే దానికి మేమేమీచేయలేమని.. నిరసన అంతా టీకప్పులో తుఫాన్ లాంటిది.. అంతా సమసి పోతుందని భావిస్తున్నాం అని వ్యాఖ్యానించారు పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?