Andhra Pradesh: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి లో పౌర సేవలు మరింత ఈజీ అవడం కావడం కోసం ఉద్యోగుల ప్రమోషన్ చానెల్స్ లో మార్పుకోసం చేసింది ప్రభుత్వం. దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది..ఇక నుంచి సింగిల్ కేడర్ గానే ఎంపీడీఓ డీఎల్పీఓలను మార్చారు. ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఎంపీడీఓల రిక్రూట్మెంట్ ను రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో గందరగోళానికి కారణం అవుతున్న కేడర్ రేషనలైజేషన్ ప్రక్రియకు రాష్ట్ర కేబినెట్ అమోదం తెలిపింది. ఈమేరకు గ్రామీణాభివృద్ధి శాఖలోని సర్వీసు నిబంధనల పునర్వవస్థీకరణకు కేబినెట్ తీర్మానించింది. ఎంపీడీవో, డీఎల్పీఓలను సింగిల్ కేడర్ గా మార్చేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది. పోస్టులను అప్ గ్రేడ్ చేయటం ద్వారా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిప్యూటీ సీఈఓను ఒకే కేడర్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఎంపీడీఓల నియామకాన్ని ఏపీపీపీఎస్సీ ద్వారా జరిగే ప్రత్యక్ష నియామకాల నుంచి తప్పిస్తూ కేబినెట్ ఆమోదించింది..
Read Also: Women’s Day-2025: వనిత టీవీ ‘ఉమెన్స్ డే’ స్పెషల్ సాంగ్ రిలీజ్..
డీడీవో, డీపీవో, డిప్యూటీ సీఈవోలకు సంబంధించి మొత్తం ఖాళీల్లో మూడోవంతు ఖాళీలను ప్రత్యక్ష నియామకం ద్వారా చేయాలని నిర్ణయించారు. మిగిలిన రెండు వంతుల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే జెడ్పీసీఈవోల పోస్టుల్లో 50 శాతం మేర ఐఎఎస్ ల ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నా వారు లేక పోతే పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు తీర్మానం చేశారు. మొత్తంగా పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను బలోపేతం చేసేలా ఈ సంస్కరణలను కేబినెట్ ఆమోదించింది. మరోవైపు ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025పై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది. కుప్పం నియోజకవర్గంలో రూ.5.34 కోట్లతో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుకు కూడా మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెంట్రల్ పూల్ లో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను సృష్టించేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది.
Read Also: Gold Loans: ఆర్బీఐ కొత్త రూల్స్.. గోల్డ్ లోన్లు ఇకపై అంత ఈజీ కాదు!
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం కోసం ఉచితంగా 27 ఎకరాల భూమి కేటాయించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. విజయనగరం జిల్లా గాజుల రేగలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి 33 ఏళ్లు లీజు ప్రాతిపదికన 2 ఎకరాలను కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద వ్యవసాయ కళాశాల నిర్మాణానికి ఉచితంగా 10 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ అంగీకరించింది. పర్యాటక ప్రాజెక్టుగా గోదావరి నదిపై రాజమహేంద్రవరం వద్ద ఉన్న పాత రైల్వే హావ్ లాక్ బ్రిడ్జి నిర్మాణం కోసం 116 ఎకరాలను కేటాయించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలియచేసింది. కాకినాడ తీరంలోని తమ్మవరం వద్ద పర్యాటక శాఖకు 115 ఎకరాల మేర కేటాయించేందుకు కేబినెట్ తీర్మానం చేసింది. పోలవరం ప్రాజెక్టులోని 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు అవసరమైన 400 కేవీ ట్రాన్సిమిషన్ లైన్ వేసేందుకు అటవీశాఖకు 5.75 ఎకరాల ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు కూడా కేబినెట్ తీర్మానం చేసింది గీతకులాలకు కేటాయించిన 335 మద్యం దుకాణాల్లో నాలుగు దుకాణాల్ని సొండి కులాల వారికి కేటాయిస్తూ చేసిన సవరణను కూడా కేబినెట్ ఆమోదించింది. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకునే ఉద్యోగులకు వేతనాలను నిర్ధారించే అంశాన్ని ఏపీఈడీబీ సీఈఓకు అనుమతి మంజూరు చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2024-29కి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది.