Bihar: నితీష్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వోద్యోగులపై సోషల్ మీడియా బ్యాన్
- బీహార్‌లో నితీష్ సర్కార్ సంచలన నిర్ణయం
- ప్రభుత్వోద్యోగులపై సోషల్ మీడియా బ్యాన్
- రూల్స్ మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వాడకంపై కఠిన ఆంక్షలు విధించింది. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో అనుచిత వ్యాఖ్యలు లేదా దురుసుగా ప్రవర్తించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: Trump Video: ఆమె అందం చూసే అతడికి పదవి ఇచ్చా.. ట్రంప్ హాట్ కామెంట్స్
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇకపై అనుమతి లేకుండా ఖాతాలను సృష్టించడం, రీల్స్ చేయడం, ప్రత్యక్ష ప్రసారం చేయడం, ఏదైనా పాలసీపై వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరచడంపై పూర్తిగా నిషేధం విధించింది. ఒకవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సోషల్ మీడియా ఖాతాను సృష్టించే ముందు సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందడం తప్పనిసరి చేసింది. అనామక లేదా నకిలీ ఖాతాలను ఉపయోగించడంపై కూడా పూర్తిగా నిషేధం విధించింది. ఒకవేళ ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: UP: యానిమల్ పేరుతో భర్త సరదాగా పరిహాసం.. భార్య ఏం చేసిందంటే..!
సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య సోషల్ మీడియా కేసులు ఎక్కువ కావడంతో మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో అనుచిత వ్యాఖ్యలు చేసే లేదా దురుసుగా ప్రవర్తించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడటానికి ఈ నియమం అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేబినెట్ మార్గదర్శకాల ప్రకారం.. బీహార్‌లోని ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సోషల్ మీడియా ఖాతాను సృష్టించే ముందు వారి సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. విధుల్లో ఉన్నప్పుడు కంటెంట్‌ను సృష్టించడం కచ్చితంగా నిషేధించబడింది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు పనికి లేదా కార్యాలయానికి సంబంధించిన కంటెంట్‌ను సృష్టించడం కూడా కచ్చితంగా నిషేధించారు. ‘‘ఏదైనా రకమైన రీల్, వీడియో, ఫొటో లేదా ప్రత్యక్ష సంభాషణను ప్రసారం చేయడం నిబంధనలను నేరుగా ఉల్లంఘించినట్లుగా పరిగణించబడుతుంది. ఇటువంటి వీడియోలు తరచుగా ప్రతికూల సందేశాన్ని పంపుతాయని.. కార్యాలయ గోప్యతను ఉల్లంఘిస్తాయి..’’ అని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వ విధానాలు, పథకాలు లేదా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు నిర్ణయాలపై ఏ ఉద్యోగి కూడా తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చర్యను క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తారు. దీనిని సర్వీస్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. కఠినమైన శిక్ష విధించబడుతుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!