ఫ్రాన్స్‌లో ప్రధానమంత్రుల మార్పిడి ఆట సాగుతోంది. ఎప్పుడు.. ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏడాదిలో నలుగురు ప్రధానమంత్రులు మారారంటే ఫ్రాన్స్‌లో ఏం జరుగుతుందో ఈపాటికే అర్థమైంటుంది.
ఫ్రాన్స్ నూతన ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను నెల రోజుల కిందటే ఆ పదవిని చేపట్టిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు మాక్రాన్ సోమవారం ఆయన రాజీనామాను ఆమోదించారు. రాజీనామాకు గల కారణం ఏంటంటే? ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఫ్రాన్స్ కొత్త ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను సోమవారం తన కొత్త మంత్రివర్గాన్ని నియమించిన కొన్ని గంటలకే రాజీనామా చేశారు. తన మిత్రదేశాలు, ప్రత్యర్థుల నుండి తన…
France Protests - Block Everything: నేపాల్ తర్వాత.. ఇప్పుడు ఫ్రాన్స్‌లో ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధుల్లోకి వచ్చారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. రాజధాని పారిస్‌లో నిరసన కారులను నియంత్రించడానికి పోలీసులు కాల్పులు జరుపుతున్నారు.
Emmanuel Macron: వియత్నాం పర్యటనలో ఉన్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌కి చేదు అనుభవం ఎదురైంది. విమానం నుంచి దిగుతుండగా, అతడి భార్య బ్రిగిట్టే మక్రాన్ చెంపపై కొట్టడం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. అంతే కాకుండా, విమానం దిగేటప్పుడు మక్రాన్ చేతిని బ్రిగిట్టే పట్టుకునేందుకు నిరాకరించింది. విమానంలో ఉన్న సమయంలోనే వీరిద్దరి మధ్య తగాదా జరిగినట్లు తెలుస్తోంది.
Zelenskyy: వైట్ హౌజ్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్స్కీ మధ్య వాగ్వాదం ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ఒకరిపై ఒకరు బిగ్గరగా మాట్లాడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పరిణామాలతో సమావేశంలో పాల్గొన్న దౌత్యవేత్తలతో సహా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు షాక్‌కి గురయ్యారు. జెలెన్స్కీ అమెరికాని అగౌరపరిచారంటూ, యుద్ధం ఆగడం అతడికి ఇష్టం లేదని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, అమెరికా ఒక హంతకుడు(పుతిన్)కి మద్దతుగా…
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు రోజుల ఫ్రాన్స్ అమెరికా పర్యటనలో ఉన్నారు. దాని మొదటి దశలో ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి 'AI యాక్షన్ సమ్మిట్'కు అధ్యక్షత వహిస్తారు.
ప్రధాని మోడీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తు్న్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటన కోసం సోమవారం ఢిల్లీ నుంచి ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్లారు. పారిస్‌లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన అమెరికా పర్యటనకు ముందు కీలక సందేశం ఇచ్చారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ..‘‘ నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ట్రంప్ మొదటి పదవీకాలంలో నిర్మించబడిన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడాని పర్యటన సహకరిస్తుందని మోడీ అన్నారు. ప్రధాని మోడీ ముందుగా మూడు రోజుల పర్యటన…
Zelensky: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు మాత్రమే భయపడతారని డొనాల్డ్ ట్రంప్ కు చెప్పినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపాడు. ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ లతో ఇటీవల భేటీ అయిన విషయం గురించి ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
తాను అధికార బాధ్యతల నుంచి తప్పుకోను.. త్వరలోనే కొత్త ప్రధాన మంత్రిని నియమిస్తానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఎలిసీ ప్యాలెస్ నుంచి ఫ్రాన్స్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మీరు ఐదేళ్లు పాలించమని నాకు అధికారం ఇచ్చారు.. అన్ని వ్యవస్థలను సక్రమంగా నడిపిస్తాను.. ప్రజలను రక్షిస్తూ దేశాన్ని ముందుకు తీసకెళ్లే బాధ్యత నాపై ఉందని మెక్రాన్ చెప్పుకొచ్చారు.