ఫ్రాన్స్ నూతన ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను నెల రోజుల కిందటే ఆ పదవిని చేపట్టిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు మాక్రాన్ సోమవారం ఆయన రాజీనామాను ఆమోదించారు. రాజీనామాకు గల కారణం ఏంటంటే? ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఫ్రాన్స్ కొత్త ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను సోమవారం తన కొత్త మంత్రివర్గాన్ని నియమించిన కొన్ని గంటలకే రాజీనామా చేశారు. తన మిత్రదేశాలు, ప్రత్యర్థుల నుండి తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
Also Read:Gudivada Amarnath: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం ఎప్పుడూ వ్యతిరేకమే..
ఫ్రెంచ్ ప్రధానమంత్రి రాజీనామా హాట్ టాపిక్ గా మారింది. ఇది ఫ్రాన్స్ రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. రాజీనామా వార్త తర్వాత, ఫ్రెంచ్ స్టాక్ మార్కెట్ తీవ్రంగా క్షీణించాయి. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సన్నిహిత మిత్రుడు లెకోర్ను, వివిధ రాజకీయ పార్టీలతో వారాల తరబడి సంప్రదింపులు జరిపిన తర్వాత ఆదివారం తన మంత్రులను నియమించారు. సోమవారం మధ్యాహ్నం మంత్రివర్గం తన మొదటి సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే, ప్రధానమంత్రి అంతకు ముందే తన రాజీనామాను ప్రకటించారు. సోమవారం ఉదయం లెకోర్ను తన రాజీనామాను మాక్రాన్‌కు సమర్పించడం గమనార్హం. సెబాస్టియన్ లెకోర్ను తన రాజీనామాను రిపబ్లిక్ అధ్యక్షుడికి సమర్పించారని, ఆయన దానిని ఆమోదించారని ఎలీసీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది.