Republic Day Parade: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. కాగా, రెండు రోజుల పాటు ఆయన భారత్ లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మాక్రాన్ భారత్‌కు చేరుకుంటారు. జైపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇక, ఆ తర్వాత మోడీతో కలిసి మాక్రాన్ జైపూర్‌లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. Read…
గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రేపు (గురువారం) భారత్‌కు రానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకాబోనున్నారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అక్టోబర్ 7నాటి దాడి తర్వాత ఇజ్రాయిల్, గాజాస్ట్రిప్ పై భీకరదాడులు చేస్తోంది. హమాస్‌ని సమూలంగా నాశనం చేసేదాకా విశ్రమించేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. హమాస్ ఇజ్రాయిల్‌పై జరిపిన దాడుల్లో 1400 మంది చనిపోయారు, ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ గాజాపై దాడి చేస్తోంది. ఈ దాడుల వల్ల సామాన్య పాలస్తీనియన్లు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ఇప్పటికే 11000 మంది పాలస్తీనా…
France: ఫ్రాన్స్‌లో హై అలర్ట్ నెలకొంది. దాడులు జరుగుతాయనే బెదిరింపుల నేపథ్యంలో ప్రభుత్వం అలర్టైంది. పారిస్ సమీపంలోని 6 ఎయిర్ పోర్టులను అధికారులు ఖాళీ చేయించారు. లిల్లే, లియోన్, నాంటెస్, నైస్, టౌలౌస్, బ్యూవైస్ విమానాశ్రయాలను అత్యవసరంగా ఖాళీ చేయించారు. బుధవారం ఈమెయిల్ ద్వారా దాడి జరుగుతుందని ఓ అగాంతకుడు బెదిరింపులకు పాల్పడ్డారు.
France: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. 2030 నాటికి 30,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ని ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇటీవల ప్రధాని మోడీ ఫ్రాన్స్ సందర్శించారు. ఈ సమయంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇది జరిగిన నెల తర్వాత మక్రాన్ ఈ ప్రకటన చేశారు.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫ్రాన్స్ చేరుకున్నారు. బాస్టిల్ డే పరేడ్ కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఫ్రాన్స్ రాజధాని పారిస్ కి చేరుకున్నాు. పీఎం మోడీని అక్కడి ప్రభుత్వం ఘనంగా ఆహ్వానించింది. ఫ్రాన్స్ ప్రధాని లెలిజబెత్ బోర్న్ ఆయనకు స్వాగతం పలికారు. జూలై 13,14 తేదీల్లో ఆయన ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. మోడీకి ఫ్రాన్స్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వెల్కమ్…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వారంలో రెండు రోజులపాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన వేళ ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ యుద్ధ విమానాలను, 3 స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాములను కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తోంది.
PM Modi: జూలై 14 ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ గౌరవ అతిథిగా హాజరుకాబోతున్నారు. పారిస్‌లోని చాంప్స్ ఎలిసీస్‌లో జరిగే బాస్టిల్ డే ఫ్లైపాస్ట్‌లో భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్ యుద్ధవిమానాలు పాల్గొనున్నాయి.
France President: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను క్లబ్‌లోని ఆటగాళ్లతో కలిసి బీర్ తాగుతున్నాడు. క్లబ్‌లో ఉన్న వారితో కలిసి బీరు తాగుతూ ఉత్సాహంగా ఉన్నాడు.