ఫ్రాన్స్‌లో మితవాద, అతివాద చట్ట సభ్యలు ఒక్కటై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రధాని మిచెల్ బార్నియర్ తన పదవిని కోల్పోయారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి మిచెల్ బార్నియర్, ఆయన మంత్రివర్గంపై ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. ఫ్రెంచ్ ప్రధాన మంత్రి మిచెల్ బార్నియర్ ప్రభుత్వం ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీలో విశ్వాస ఓటింగ్‌లో ఓడిపోయింది.
UNSC: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత దేశం చేస్తున్న ప్రయత్నాలకు ఫ్రాన్స్ సపోర్ట్ ఇచ్చింది. శక్తిమంతమైన భద్రతా మండలిని వెంటనే విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొనింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇమాన్యుయేల్ మక్రాన్ ‘‘ముద్దు’’ వివాదంలో ఇరుక్కున్నారు. ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్రెంచ్ క్రీడా మంత్రి అమేలీ ఓడియా-కాస్టెరాని ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. అధ్యక్షుడు మక్రాన్ మెడపై చేయి వేసి కిస్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారానికి దారి తీసింది.
France Elections 2024: ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూల్ మాక్రోన్ పార్టీకి అధికారం చేపట్టడానికి కావాల్సిన మెజారిటీ రాలేదు.. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతుంది.
Emmanuel Macron: భారత గణతంత్ర వేడుకులకు ఈ ఏడాది ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ వచ్చారు. ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు సాగిన ఆయన పర్యటన జైపూర్ నగర సందర్శనతో మొదలైంది. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా రక్షణ, టెక్నాలజీ రంగాల్లో ఒప్పందాలు చోటు చేసుకున్నాయి.
Emmanuel Macron: భారతదేశం, ఫ్రాన్స్ మధ్య స్నేహం నిరంతరం బలపడుతోంది. 75వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌తో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.
భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థులకు ఫ్రాన్స్ అందించే తోడ్పాటు గురించి కూడా అధ్యక్షుడు ఇమాన్యయేల్ మెక్రాన్ వివరించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం సాయంత్రం జైపూర్‌కు చేరుకున్నారు. ఆయనకు జంతర్ మంతర్ వద్ద ప్రధానమంత్రి మోడీ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ కరచాలనం చేసి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు చారిత్రక జంతర్‌మంతర్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కాగా.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. రెండ్రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు.