ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుపాటుకు నలుగురు మృతిచెందారు.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది.. మృతులంతా కూలీలుగా చెబుతున్నారు.. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలలో పిడుగు పడి నలుగురు కూలీలు మృతిచెందారు.. జామాయిల్ తోటలో కూలి పనికి వచ్చిన వారిపై తెల్లవారుజామున పిడుగు పడింది.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో.. విజయవాడకు తరలించారు.. జమాల్ తోట నరికేందుకు ఉదయమే పొలానికి వచ్చారు దాదాపు 30…
ఈజీ మనీకోసం అర్రులు చాస్తోంది యువత. వివిధ మార్గాల్లో యువకులను ట్రాప్ చేసి వారి అకౌంట్లను కొల్లగొడుతున్నారు. ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి.. పరిచయంలేని వ్యక్తులు పంపే మెసేజ్ ల జోలికి వెళ్ళొద్దంటూ పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొందరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షలకి లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఏలూరు జిల్లా భీమడోలులో అధిక వడ్డీలు ఇస్తామని పోస్టల్ ఉద్యోగి ఏడులక్షలు పోగొట్టుకున్న ఉదంతం మర్చిపోకముందే అదే జిల్లాలో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఉపాధికోసం…
రేపు ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు గణపవరంలో జరిగే రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఉదయం 10.10 గంటలకు గణపవరం హెలిప్యాడ్‌కు జగన్ చేరుకుంటారు. ఉదయం 10.25 గంటలకు పిప్పర రోడ్డులోని చింతలపాటి మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని సభా ప్రాంగణానికి జగన్ చేరుకోనున్నారు. Andhra Pradesh: రైతులకు శుభవార్త.. రేపు వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు…
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామ వైసీపీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కారణంగా జి.కొత్తపల్లిలో పోలీసుల రెండు వారాల పాటు 144 సెక్షన్ విధించారు. గ్రామంలో 8 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 150 మంది పోలీసులు మోహరించారు. ఈ కేసుకు సంబంధించి 10 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బజారయ్య ద్వారకాతిరుమల పోలీసుల…
ద్వారకాతిరుమలలో వైసీపీ నేత గంజి ప్రసాద్ దారుణ హత్య కలకలం రేపింది. ఘటన తెలుసుకుని అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. ఎమ్మెల్యే తలారికి గాయాలయ్యాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గంజి ప్రసాద్ గతంలో టీ డీ పీ తరపున సొసైటీ డైరెక్టర్ గా పని చేశారు.. గత ఎన్నికల ముందు వై సి పీ లో చేరారు. అనుమానితుడు బజారయ్య వై సి పీ తరపున ఎం పీ టీ…