Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడులో ప్రేమ జంటను కాపాడేందుకు పోలీసులు ఏకంగా స్టేషన్ గేట్లను మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్థానిక బాపునగర్‌కు చెందిన యువతి- యువకుడు ప్రేమ పెళ్లి చేసుకుని ప్రాణభయంతో నూజివీడు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
Pawan Kalyan : డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు (సోమవారం) ఏలూరు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయన హెలికాప్టర్ ద్వారా రావాలని యోచించిన ముందస్తు ప్రణాళికను రద్దు చేసి, రోడ్డు మార్గాన పర్యటించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, పోతవరం, ఆరిపాటి దిబ్బలు, యర్రంపేట, రాజవరం మీదుగా ఐ.ఎస్. జగన్నాధపురం…
Eluru Police: గుట్టు చప్పుడు కాకుండా అందినకాడికి దండుకొని ఎంజాయ్ చేసే దొంగలు ఉన్నారు.. అయితే, ఏ దొంగ అయినా.. ఇప్పుడు కాకపోతే.. కొంత కాలానికైనా దొరకకుండా తప్పించుకోలేడు.. మరికొందరైతే పోలీసులకే సవాల్ విసిరే వాళ్లు ఉన్నారు.. తాజాగా, పోలీసులకు సవాల్ విసిరిన ఓ దొంగను పట్టుకుని.. చుక్కలు చూపించారు పోలీసులు.. బైక్ చోరీలకు పాల్పడడమే కాదు.. చోరీ చేసిన బైకులను అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సా చేస్తూ పోలీసులకే సవాల్ విసిరాడు ఓ దొంగ.. 100…
Bus Accident in AP: తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా వరుసగా రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన.. చేవెళ్ల సమీపంలో ఈ రోజు ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో 19 మంది మృతిచెందారు.. ఇక, రాజస్థాన్‌లోనూ ఓ ఘోర ప్రమాదం జరిగింది.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఏలూరు జిల్లాలో భారతి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది.. లింగపాలెం మండలం జూబ్లీ నగర్ సమీపంలో…
ఏలూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేల నోటి నుంచి వచ్చిన మాటలు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. సీనియర్, జూనియర్ అన్న తేడా లేదు. అందరిదీ అదే రాగం. అధికారులు మా మాట వినడం లేదన్నదే బాధ. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే... మంత్రి పార్థసారధి కూడా మీరంతా నాకు చెబుతున్నారు సరే... నేనెవరికి చెప్పుకోవాలన్నట్టుగా మాట్లాడారట. ఇదంతా చూస్తున్నవాళ్ళు మాత్రం విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్తిబాబు కేరక్టర్‌ని గుర్తు చేసుకుంటున్నారు. అందులో బాధితులంతా ఎమ్మెల్యే…
ఛత్తీస్‌ఘఢ్‌లో ఎన్‌కౌంటర్‌ల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు 10 రోజులు ఎలాంటి పర్యటనలు పెట్టుకోవద్దని పోలీస్ శాఖ సూచనలు చేసింది. ఎమ్మెల్యేను నేరుగా కలిసేందుకు కూడా రావద్దని, ఫోన్ లో సంప్రదించాలని ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
కోళ్ల ఫారం సమీపంలోని ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. బర్డ్ ఫ్లూ సోకినట్టు తేలిందని వార్తలు గుప్పుమన్నాయి.. అయితే, ఈ వార్తలపై సీరియస్‌గా స్పందించారు ఏలూరు జిల్లా కలెక్టర్.. ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోందన్న ఆమె.... అయితే, జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలో.. భారత్‌లోనే ఇప్పటి వరకు ఒక్క బర్డ్ ప్లు కేసు కూడా బర్డ్ నుండి మనుషులకు రాలేదని స్పష్టం చేశారు.
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.. కొన్ని సార్లు ఓ అసత్యం కూడా.. సత్యంగా ప్రచారంలోకి వస్తుంది.. అలాంటి పరిస్థిత ఏలూరు జిల్లాలో వచ్చింది.. పిల్లి పిల్లలను చూసి.. అవి పులి పిల్లలు అని భావించిన స్థానికికులు భయాందోళనకు గురయ్యారు.. ఆ తర్వాత నిజం తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పొరపాటున మీ అకౌంట్‌కు డబ్బులు పంపించామని చెబితే నమ్మారో.. ఇక అంతే సంగతులు. మీ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అయిపోతాయి సుమీ. రోజుకో పంథాలో కేటుగాళ్లు అమాయకుల నుంచి దోచుకుంటున్నారు. తాజాగా ఏలూరుకు చెందిన ఓ వ్యక్తికి చిన్న మొత్తంలో డబ్బులు పంపించి.. పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేశారు కేటుగాళ్లు.