ద్వారకాతిరుమలలో వైసీపీ నేత గంజి ప్రసాద్ దారుణ హత్య కలకలం రేపింది. ఘటన తెలుసుకుని అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. ఎమ్మెల్యే తలారికి గాయాలయ్యాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
గంజి ప్రసాద్ గతంలో టీ డీ పీ తరపున సొసైటీ డైరెక్టర్ గా పని చేశారు.. గత ఎన్నికల ముందు వై సి పీ లో చేరారు. అనుమానితుడు బజారయ్య వై సి పీ తరపున ఎం పీ టీ సీ గా ఉన్నాడు. గ్రామంలో రెండు వర్గాలు గా వైసీపీ నేతలు విడిపోయారు. గత ఎం పీ టీ సీ ఎన్నికల్లో బజారయ్య కి వ్యతిరేకంగా మృతుడు ప్రసాద్ పని చేశారు. మృతుడు ప్రసాద్ ఎం పీ టీ సి బజారయ్య కి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టాడు.. ఆఎన్నికల్లో బజారయ్య గెలిచాడు. గతంలో హోం మంత్రి వనిత కి ప్రధాన అనుచరుడు మృతుడు గంజి ప్రసాద్. గతంలో గోపాల పురం లో టీ డీ పీ తరపున వనిత ఎమ్మెల్యే గా పని చేశారు. టీ డీ పీ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే వనిత కోసం పని చేసీన వ్యక్తి ప్రసాద్. నిందితుడు ఎం పీ టీసీ బజారయ్య దొంగ నోట్లు మారుస్తాడని సమాచారం వుంది. బజారయ్య దొంగ నోట్లు మార్చే పనికి అడ్డుపడుతున్న గంజి ప్రసాద్ వర్గంపై కక్ష పెంచుకున్నారు.
గోపాలపురం ఎమ్మెల్యే పై దాడి పై హోమ్ మినిస్టర్ వనిత స్పందించారు. వైసిపీ నేత గంజి ప్రసాద్ ను దారుణంగా చంపారు.. ఈ ఘటన చాలా బాధాకరం. పరామర్శించడానికి గోపాలపురం ఎమ్మెల్యే వెళ్లారు . ఆయన పై అధికార పార్టీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారు. చనిపోయింది మా పార్టీ వ్యక్తే, దాడికి పాల్పడింది మా కార్యకర్తలే. జరిగిన సంఘటనపై ఎస్పీతో మాట్లాడాను. జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దాడికి కారణం ఏమిటి అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతారు. పేద వారి దగ్గర నుండి ప్రజాప్రతినిధులు వరకు అందరికి పూర్తి భద్రత కల్పిస్తున్నాం అన్నారు హోంమంత్రి వనిత.
ఏలూరు సంఘటన దురదృష్టకరం అన్నారు మంత్రి జోగి రమేష్. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీ చర్యలు తీసుకుంటుంది. హత్యకు కారకులెవరైనా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తప్పవు. కొన్ని నియోజకవర్గాల్లో చిన్న చిన్న విబేధాలు ఉన్నాయి. కలిసి ఉంటేనే కలదు సుఖం అని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని సర్దుకుంటాయి. పార్టీలో నాయకులందరం కలిసి పని చేస్తాం.