గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. దీంతో అక్కడ రెండువర్గాలుగా విడిపోవడంతో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి లో దారుణ హత్య జరిగింది. దీంతో అక్కడ కలకలం రేగింది. వైసీపీ గ్రామ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ ను నరికి చంపారు కొంతమంది దుండగులు. దీంతో ఊరు చివర పడి ఉంది ప్రసాద్ మృత దేహం. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. గ్రామ సర్పంచ్…