దొంగలు ఏది దొరికితే అవి నొక్కేస్తారు. ఉదయం సూచిన వాటిని రాత్రికి పక్కా స్కెచ్చేసి దొంగతనాలు చేసేస్తారు. ఈమధ్యకాలంలో ఏపీలో దేవాలయాల్లో దొంగతనాలు బాగా పెరిగిపోయాయి. అర్థరాత్రి వేళ గుడిలో దొంగతనానికి వెళ్ళిన దొంగ ఏమి చేశాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. నోట్ల కట్టలు దొంగిలించి చిల్లర డబ్బులు మళ్ళీ దేవుడికే ఇచ్చేశాడా దొంగ. చివరగా వెళ్ళిపోతూ తాను చేసిన పాపాలను పోగొట్టు స్వామి అని దణ్ణం పెట్టుకుని ఉడాయించాడు. ఈ సీన్ కాస్తా ఆలయం సీసీ కెమేరాలో రికార్డ్ అయి వైరల్ అవుతోంది.
ఏలూరు జిల్లా భీమడోలు సమీపంలోని ద్వారకాతిరుమల ప్రధానరహదారి పక్కన తిమ్మాపురం ఊరుంది. ఆ ఊరు సమీపంలో విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంది. అయితే ఓదొంగ అర్థరాత్రి సమయంలో గునపంతో గుడి తలుపులు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించాడు. హుండీని తెరిచి అందులోఉన్న నగదును ఎంచక్కా కింద కూర్చుని లెక్కపెట్టుకున్నాడు. నోట్లు మాత్రం తీసుకుని చిల్లర డబ్బులు తిరిగి దేవుడికే వేసేశాడు. అంతేకాదు వెళ్ళిపోయే ముందు తన పాపాలను పోగొట్టు దేవుడా అంటూ స్వామికి నమస్కరించి అక్కడినుంచి పారిపోయాడు. ఈ సీన్ మొత్తం ఆలయంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీసీ కెమేరా ఆధారంగా ఆ దొంగను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.
Viral Video: రోడ్డు మీదే పోశాడు.. ఫలితం అనుభవించాడు