Pawan Kalyan : డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు (సోమవారం) ఏలూరు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయన హెలికాప్టర్ ద్వారా రావాలని యోచించిన ముందస్తు ప్రణాళికను రద్దు చేసి, రోడ్డు మార్గాన పర్యటించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, పోతవరం, ఆరిపాటి దిబ్బలు, యర్రంపేట, రాజవరం మీదుగా ఐ.ఎస్. జగన్నాధపురం గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తరువాత గ్రామంలో ఉన్న 30 ఎకరాల ఆలయ భూమి పత్రాలను అధికారులకు అందజేయడంతో పాటు, దేవాలయానికి నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.