Elon Musk: టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల సీఈవో.. ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన నుంచి వైదొలిగారు. ఫెడరల్ ప్రభుత్వంలో పునర్ఘటనం, వ్యర్థ వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన “Department of Government Efficiency (DOGE)”లో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన పనిచేశారు. తన అధికారిక పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో మస్క్ బుధవారం X ద్వారా ఈ ప్రకటన చేశారు. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా నిర్ణీత కాలం ముగిసింది. ప్రభుత్వ వ్యర్థ వ్యయాన్ని తగ్గించే అవకాశాన్ని కల్పించినందుకు అధ్యక్షుడు ట్రంప్ కు కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. DOGE లక్ష్యం కాలక్రమేణా ప్రభుత్వంలో ఒక జీవనశైలిగా మారుతుందని మస్క్ వెల్లడించారు.
Read Also: SA vs Ban: గ్రౌండ్ లోనే చితకొట్టుకున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. వీడియో వైరల్
అయితే, మస్క్ తన పదవికి రాజీనామా చేసిన ఈ ప్రకటన, అధ్యక్షుడు ట్రంప్ నూతన చట్టంపై చేసిన విమర్శల తరువాత రావడం గమనార్హం. ఆ చట్టం పన్ను తగ్గింపులు, వలస నియంత్రణ చర్యలను కలిగి ఉండగా, దీన్ని ట్రంప్ “బిగ్ బ్యూటిఫుల్ బిల్”గా వ్యవహరిస్తున్నారు. అయితే ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ ఈ బిల్లును “అధిక ఖర్చుతో కూడిన బిల్లు”గా విమర్శించారు. ఇది ప్రభుత్వ అప్పును పెంచుతుందని, తాను చేస్తున్న DOGE పనికి ఇది వ్యతిరేకంగా పనిచేస్తుందని అన్నారు. ఒక బిల్లు పెద్దగా ఉండవచ్చు, అందంగా ఉండవచ్చు. కానీ రెండూ కలిసుండటం కష్టం అని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
మస్క్ వ్యాఖ్యలపై ట్రంప్ అదే రోజు ఒవల్ ఆఫీసులో స్పందిస్తూ.. ఈ బిల్లులో నాకు నచ్చని అంశాలున్నాయి. అయితే, కొన్ని అంశాలు మాత్రం నాకు చాలా ఇష్టం అని చెప్పారు. ఇంకా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని కూడా ఆయన సూచించారు. అలాగే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలని ట్రంప్ అన్నారు.
As my scheduled time as a Special Government Employee comes to an end, I would like to thank President @realDonaldTrump for the opportunity to reduce wasteful spending.
The @DOGE mission will only strengthen over time as it becomes a way of life throughout the government.
— Elon Musk (@elonmusk) May 29, 2025