BYD సీలియన్ 7 ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్లో లాంచ్ చేశారు. 2025 ఫిబ్రవరి 17న BYD భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ SUV, సెడాన్ కార్లను విడుదల చేసింది. ఈ కారును భారత్ మొబిలిటీ 2025 నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. కాగా.. 2025 జనవరి18 నుండే ఈ వాహనానికి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
చైనా ఎలక్ట్రిక్ SUV తయారీదారు BYD త్వరలో భారత మార్కెట్లో కొత్త Sealion 7 ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. ఈ SUVని ఫిబ్రవరి 17, 2025న అధికారికంగా లాంచ్ చేయనుంది. కంపెనీ 2025 లో భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
Mercedes-Benz G580 EQ Electric: మెర్సిడెస్-బెంజ్ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో దిగ్గజ G-వాగెన్ ఎలక్ట్రిక్ వెర్షన్, జీ580 ఈక్యూని విడుదల చేసింది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని జనవరి 17న భారత్ మొబిలిటీ షోలో విడుదల కానుంది. కంపెనీ తాజాగా ఈ కొత్త ఈవీ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో కార్ కి సంబంధించి అనేక వివరాలు పంచుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 473 కి.మీ రేంజ్ వస్తుందని వీడియోలో పేర్కొన్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
2022లో ప్రారంభించిన EV6 క్రాస్‌ఓవర్ తర్వాత కియా ఇండియా.. ఆల్-ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. EV9 ఆల్-ఎలక్ట్రిక్ SUV పూర్తిగా లోడ్ చేయబడిన GT-లైన్ AWD వేరియంట్‌లో అందిస్తున్నారు. ఈ కారు ధర రూ. 1.3 కోట్లు (ఎక్స్-షోరూమ్).
Kia EV9: కియా మోటార్స్ భారత మార్కెట్లో విడుదల చేయనున్న EV9 గురించి వివరాలను వెల్లడించింది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 561 కిలోమీటర్ల వరకు జర్నీ కొనసాగుతుందని ARAI ధృవీకరించింది. కియా EV9 బ్యాటరీని DC ఫాస్ట్ ఛార్జర్‌తో 24 నిమిషాల్లో 10-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది 5 రంగులలో లభిస్తుంది. స్నో వైట్ పెర్ల్, ఓషన్ బ్లూ, పెబుల్ గ్రే, పాంథెరా మెటల్, అరోరా బ్లాక్ పెర్ల్. అలాగే 2 డ్యూయల్-టోన్ ఇంటీరియర్…
Mercedes-Benz ఇండియా మేబ్యాక్ EQS ఆల్-ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది. దీని ధర.. రూ. 2.25 కోట్లు ఉంది. EQS 680 అనేది నెట్-ఎలక్ట్రిక్ లగ్జరీ SUV. ఇది గత ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చింది. అయితే.. మంచి లగ్జరీ కారు కోసం చూస్తున్న కస్టమర్లకు ఈ కారు గొప్ప ఎంపిక. ఎందుకంటే ఈ కారు అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా.. డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంది.
Volvo C40 Recharge: స్వీడన్ ఆటోమేకర్ వోల్వో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వోల్వో C40 రీఛార్జ్ కారును లాంచ్ చేసింది. ఇది ఈ కంపెనీ రెండో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అంతకుముందు వోల్వో నుంచి XC40 రీఛార్జ్ ఉంది. ఇండియా కార్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో అన్ని