భారతీయ SUV మార్కెట్‌లో ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. ఈ వాహన విభాగాన్ని దృష్టిలో ఉంచుకొని, వాహన తయారీదారులు కొత్త మోడల్స్‌ను పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో, టాటా మోటార్స్ త్వరలో టాటా సియెర్రా SUVని భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ SUV ఇటీవల టెస్టింగ్ సమయంలో మొదటిసారి కనిపించింది. మీడియా నివేదికల ప్రకారం.. టాటా మోటార్స్ టాటా సియెర్రా SUVని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.
Read Also: America : అమెరికా గుడ్ల సంక్షోభం.. అండగా నిలిచిన టర్కీ
టాటా సియెర్రా SUV ఫీచర్లు:
పూర్తిగా కమ్ముకున్న ప్రొటోటైప్ అయినప్పటికీ, కొన్ని ముఖ్యమైన ఫీచర్లు బయటపడ్డాయి. ఈ SUVలో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లలో 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, LED లైట్లు, ట్రిపుల్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. కాగా.. ఈ SUVని భారత్ మొబిలిటీ 2025లో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో చూపిన వాహనం, ప్రొడక్షన్ వెర్షన్‌కి చాలా దగ్గరగా ఉంది.
టాటా సియెర్రా: EV, ICE వెర్షన్లతో
ఈ SUV EV (Electric Vehicle), ICE (Internal Combustion Engine) రెండు వెర్షన్లలో లాంచ్ అవుతుంది. నివేదికల ప్రకారం.. ఈ SUVలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ SUV టెస్టింగ్‌లో ఉంది. ఈ సమయంలో సాంకేతిక లోపాలను సరిచేసి, తదనంతరంలో ఈ వాహనాన్ని లాంచ్ చేయనున్నారు. నివేదికల ప్రకారం 2025 ఏడాది చివర్లో ఈ SUV భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల కానుంది.