దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని జనవరి 17న భారత్ మొబిలిటీ షోలో విడుదల కానుంది. కంపెనీ తాజాగా ఈ కొత్త ఈవీ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో కార్ కి సంబంధించి అనేక వివరాలు పంచుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 473 కి.మీ రేంజ్ వస్తుందని వీడియోలో పేర్కొన్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
READ MORE: Nimisha Priya case: యెమెన్‌లో నిమిషా ప్రియాకు మరణశిక్ష.. రక్షించేందుకు ఇరాన్ సాయం..
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రి ఈవీలో రెండు రకాల బ్యాటరీలు ఉన్నాయి. మొదటిది1-42kWh బ్యాటరీ ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 390 కి.మీ రేంజ్ ఇస్తుంది. రెండవది 2-51.4kWh బ్యాటరీతో వస్తుంది. దీని రేంజ్ 473 కి.మీ. ఈ కొత్త ఈవీ కేవలం 7.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. అలాగే.. ఇది మూడు డ్రైవ్ మోడ్‌లతో (ఎకో, నార్మల్, స్పోర్ట్) వస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేయడానికి 58 నిమిషాలు మాత్రమే పడుతుంది. 11kW ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్‌తో 10% నుంచి 100% వరకు ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది. ఈ కారుకు ముందువైపు ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు.
READ MORE: Khel Ratna Awards: ఖేల్‌రత్న అవార్డుల ప్రకటన.. మను భాకర్, గుకేష్ కుమార్‌తో సహా.. మరో ఇద్దరికి
ఇంటీరియర్ గురించి చెప్పాలంటే.. డిజిటల్ కీ, ఇందులో రెండు 10.25-అంగుళాల స్క్రీన్‌లు, కొత్త ఫ్లోటింగ్ సెంట్రల్ కన్సోల్ డిజైన్, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 ADAS(అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), పనోరమిక్ సన్‌రూఫ్, పలు డిజిటల్ ఫీచర్లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్స్‌లెన్స్ వంటి నాలుగు వేరియంట్లలో ఈ కారు లాంచ్ కానుంది. ఈ ఈవీలో కొత్త ఏరో ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్ ఇన్‌స్టాల్ అమర్చారు. దీని ముందు, వెనుక బంపర్‌లు కారుకు కొత్త లుక్ ఇచ్చాయి. ఫ్రంట్ గ్రిల్‌ను మూసేసి దీనికి స్పష్టమైన ఎలక్ట్రిక్ రూపాన్ని అందించారు. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ 4 వేరియంట్లలో లభ్యం కానుంది. ఇది ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్సలెన్స్ వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా.. ఈ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ నేరుగా మారుతి ఇ-విటారా, మహీంద్రా BE 6, టాటా కర్వ్ ఈవీ లతో పోటీపడనుంది.
Electric is now CRETA.
Why now? Because India is now ready.
Hyundai CRETA Electric is our statement for the ultimate EV transformation – one that embraces style, innovation, and sustainability forever.#Hyundai #HyundaiIndia #ILoveHyundai #CRETAElectric #ElectricIsNowCRETA pic.twitter.com/Ov58v1ALK5
— Hyundai India (@HyundaiIndia) January 2, 2025