రాజకీయ హింసాత్మక ఘటనలపై మూడు జిల్లాల ఎస్పీలను వివరణ కోరానని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన హత్య రాజకీయ హింసేనని జిల్లా ఎస్పీ చెప్పారన్నారు.
తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా మే 13న ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు వారి క్యాండిడేట్స్ లిస్ట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు వారి నియోజకవర్గ వర్గాలలో పెద్ద ఎత్తున మీటింగ్ లు ఏర్పాటుచేసి ఎన్నికల ప్రచారాలను ముందుకు సాగిస్తున్నారు. Also Read: Khammam Police: వింత శబ్దాలతో సైలెన్సర్లు…
అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తూ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు రాష్ట్రాల్లో జూన్ 2న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది.
లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటనకు కొన్ని రోజుల ముందు ఎన్నికల సంఘం నుంచి వైదొలగాలని మాజీ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది. మొత్తం నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించనున్నారు.
చాలా కాలంగా సినిమా షూటింగ్ జరుపుకుంటున్న.. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగజ్జ తారలు ప్రధాన పాత్రలు పోషించారు ఇందులో. వీటితోపాటు ఈ మూవీలో బాలీవుడ్ అందాల తార దిశా పటానీతో స్పెషల్ సాంగ్ కూడా…
భారతదేశ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం క్రమంగా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతోంది. పోలింగ్‌లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.
కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు పాల్గొననున్నారని ఈసీ వెల్లడించింది.
ఏపీతో పాటు తెలంగాణలో ఒకేరోజు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అక్కడి స్థానం ఖాళీ కాగా.. ఆ అసెంబ్లీ స్థానానికి కూడా మే 13న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
బ్యాలెట్ పేపర్ ( Ballot Paper ) ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు ( Supreme Court ) నేడు (శుక్రవారం) విచారించనుంది. లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Election )ను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించేలా భారత ఎన్నికల సంఘా ( EC )న్ని ఆదేశించాలని పిటిషన్లో కాంగ్రెస్ ( Congress ) పార్టీ డిమాండ్ చేసింది.