Revanth Reddy: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసుల బందోబస్తు,144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ టీంల ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించనున్నారు.
Read also: MLA Raja Singh: ఎమ్మేల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్..
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ సరళి కొనసాగనుంది. ఇక, ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పత్రాల ద్వారా తమ ఓటు హక్కును స్థానిక సంస్థల ఓటర్లు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 1439 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జెడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు.
MP Bandi Sanjay: బండి సంజయ్ పై కేసు నమోదు.. కారణం ఇదీ..