బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల కోసం బీజేపీ వివిధ కమిటీలు వేసింది. ఆ కమిటీలు చేసిన, చేయాల్సిన పనులపై కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలకు కిషన్ రెడ్డి సూచనలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీ బీజేపీ (AP BJP) సన్నద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై బీజేపీ నేతలు చర్చలు ప్రారంభించారు. శని, ఆదివారాల్లో పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది.
Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏ రాజకీయ పార్టీతో పొత్తు ఉండదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే వెళుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad).. కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా డెమొక్రాటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు విశాఖ నుంచి పోటీ చేస్తానని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. రాబోయే ఎన్నికల్లో మూడురోజులు పోలింగ్ జరపాలని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెబ్ సైట్స్ లో పొందు పరచాలని సుప్రీమ్ తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు పోలింగ్ శాతాన్ని నియంత్రిస్తున్న విధానాన్ని జై భారత్ నేషనల్ పార్టీ అడ్డుకుంటుందని అన్నారు.
త్వరలో దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలకు నిర్వహించేందుకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
పార్టీ నేతలతో టీడీపీ అధినేతచంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈసారి పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున టిక్కెట్ రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని సూచించారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఖచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని తెలిపారు. జగన్ తో విసిగిపోయిన చాలా మంది వైసీపీ నేతలు.. రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరుతాం అంటున్నారని చెప్పారు. మంచి వారై ఉండి, పార్టీకి బలోపేతానికి…
సినీనటుడు శివాజీ ఓటు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటుకు డబ్బులు అడగొద్దని.. తప్పు చేసి చాలా మంది సంపాదిస్తున్నారని ఆయన ప్రజలకు సూచించారు. తెలుగు వాడికి కష్టం వస్తే తాను సహించనని.. అన్యాయం చేస్తే ఎంతటి వాడినైనా ప్రశ్నిస్తానని అన్నారు.
పాకిస్థాన్ లో దేశవ్యాప్త ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అభ్యర్థి మెహర్ ముహమ్మద్ వాసిం పిఎంఎల్-ఎన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్కు అనుకూలంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.