Vijayasai Reddy: నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని రాజేంద్రనగర్‌లో వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ప్రాంతంలోని స్వర్ణకారులకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు. వీరి కోసం 500 దుకాణాలను నిర్మించి ఇస్తామన్నారు. విశ్వబ్రాహ్మణులకు వైసీపీ ప్రభుత్వం 53 నామినేటెడ్ పదవులను ఇచ్చిందన్నారు. ఈ ప్రాంతంలోని అన్ని సామాజిక వర్గాలకు లబ్ధి కలిగిందన్నారు. బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. రాజకీయంగా కూడా అధికంగా ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Read Also: BC Janardhan Reddy: బనగానపల్లెలో ఆగని వలసలు.. ఈసారి బీసీజేఆర్ గెలుపు పక్కా..?