నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అర్వింద్ నామినేషన్‌కు చందాల రూపంలో రుసుము జమ చేసి పసుపు రైతులు ఇచ్చారు. ఆ డబ్బుతోనే డిపాజిట్ చెల్లించి ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు.
జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీ-ఫారాలు అందించారు. 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 2 పార్లమెంట్ స్థానాలకు పవన్ బీ ఫారాలు అందించారు. తొలి బీ-ఫారం నాదెండ్ల మనోహర్‌కు ఇచ్చారు. రేపట్నుంచి నామినేషన్లు ఉండడంతో ఇవాళే బీ-ఫారాలు అందించారు జనసేనాని పవన్‌కళ్యాణ్.
దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ సార్వత్రిక ఎన్నికలలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు 1625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలోకి దిగారు. వీరిలో 252 మంది అభ్యర్థులు నేరచరితులు అంటే వారిపై క్రిమినల్ కేసు నమోదైంది.
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ శ్రేణులకు ప్రధాని మోడీ కీలక సందేశం ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలవాలని.. నిర్భయంగా ఓట్లు వేసేలా వారిని ప్రోత్సహించాలని కోరారు.
ఎన్నికల సందర్భంలో పింఛన్ పంపిణీని ఎందుకు రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. సంక్షేమం అనేది నిరంతరాయం.. అందుకు తగిన విధంగా ప్రభుత్వం ఎందుకు సన్నద్దంగా లేదని అడిగారు. మొత్తం వ్యవహారాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి, మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునే విధంగా మీ వైఖరి కనపడుతోందని ఆరోపించారు. సమర్ధవంతంగా పింఛన్ అందించడానికి అవసరమైన విధానాలు ఎందుకు రూపొందించుకోలేదని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు.
Revanth Reddy: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఉప ఎన్నిక కొనసాగుతోంది.
నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని రాజేంద్రనగర్‌లో వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ప్రాంతంలోని స్వర్ణకారులకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు.