చాలా కాలంగా సినిమా షూటింగ్ జరుపుకుంటున్న.. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగజ్జ తారలు ప్రధాన పాత్రలు పోషించారు ఇందులో. వీటితోపాటు ఈ మూవీలో బాలీవుడ్ అందాల తార దిశా పటానీతో స్పెషల్ సాంగ్ కూడా సందడి చేయనుంది. ఇక ఈ సినిమాను మన తెలుగు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి అశ్వినిదత్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.
Also read: HanuMan : మరి కొద్దిగంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్ హిందీ వెర్షన్..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఇకపోతే సినిమాకి సంబంధించి దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కల్కి సినిమా.. మే 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. కాకపోతే ఈ తేదీకి ప్రభాస్ సినిమా రిలీజ్ కావట్లేదన్న అనేక ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా మూవీ రిలీజ్ డేట్ పై అమితాబ్ బిగ్ అప్డేట్ కూడా ఇచ్చారు. ఇందులో భాగంగా.. ఇప్పుడీ ది మోస్ట్ అవైటెడ్ మూవీ షూటింగ్ పూర్తయిందని తన బ్లాగ్ లో రాసుకొచ్చారు అమితాబ్. నా షూటింగ్ ముగించుకుని వచ్చాను. కల్కి షూటింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయని.. ముందుగా చెప్పినట్లుగా మే 9న సినిమా విడుదల కానుందని .. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి’ అని ఆయన తెలిపారు.
Also Read: Lok Sabha Elections 2024: వెల్లివిరుస్తున్న మహిళా చేతన.. ఈ సారి పోలింగ్ కేంద్రాల్లో అనేక సౌకర్యాలు
ఇక ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులు బాగా సంతోషించారు. అయితే తాజాగా విడుదలైన ఎన్నిక షెడ్యూల్ నేపథ్యంలో ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం లేకపోలేదు. దీనికి కారణం దేశంలో ఎన్నికలు పలు విడతలలో జరగడమే. అందులోనూ తెలుగు రాష్ట్రాలలో మే 13 న పోలింగ్ ఉండడంతో మరి ఈ సినిమా రిలీజ్ అవ్వడం డౌట్ గానే కనపడుతుంది. చూడాలి మరి ప్రభాస్ కల్కి సినిమా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని ఆయోమయ పరిస్థితి ఏర్పడింది.