పొత్తులో భాగంగా టీడీపీ హైకమాండ్కు వివిధ జిల్లాల్లోని కీలక సెగ్మెంట్లు సంకటంగా మారుతున్నాయి. పెందుర్తి, రాజమండ్రి రూరల్, పిఠాపురం, కాకినాడ, అవనిగడ్డ, విజయవాడ పశ్చిమం, తెనాలి సెగ్మెంట్లపై టీడీపీ ఏటూ తేల్చుకోలేకపోతోంది. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ నేతలు రోజురోజుకూ ఒత్తిడి పెంచుతున్నారు. తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటూ టీడీపీ అధిష్టానానికి పశ్చిమ నేతల వినతులు ఇస్తున్నారు. విజయవాడ పశ్చిమం నుంచి బీసీ వర్గానికి చెందిన బుద్దా వెంకన్న టిక్కెట్ ఆశిస్తున్నారు. కాగా.. రేసులో మైనార్టీ వర్గం నుంచి…
ఎన్నికలపై సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుంటేనే ఎన్నికలలో పోటీ చేయాలి అన్నట్లు వ్యవస్థ మారిపోయిందన్నారు. ప్రస్తుత రాజకీయాలు గౌరవప్రదంగా లేవన్నారు.
Singareni Elections 2023 Polling Begins: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. 11 డివిజన్‌లలోని 84 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సింగరేణి విస్తరించి ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి.…
సింగరేణి కార్మికులకు రూ. 20 లక్షల వడ్డీలేని రుణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సింగరేణి కార్మికులను తాను ఆదుకుంటానని, కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం కృషి చేస్తానన్నారు. గడిచిన పది సంవత్సరాలు నామవాత్ర ఉద్యోగాలు నియమించారని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను చేపట్టే కార్యక్రమం ప్రారంభించిందని పొంగులేటి చెప్పారు. ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం తీసుకోబోతుందని చెప్పుకొచ్చారు. ఇల్లందు సింగరేణి జెకే ఓపెన్ కాస్ట్ ఆఫీస్…
Telangana High Court: సింగరేణి ఎన్నికల్లో మరో పెద్ద ట్విస్ట్. ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కార్మిక సంఘాల మధ్య పోరు తారాస్థాయికి చేరడమే ఇందుకు కారణం.
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తాం.. త్వరలో జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు- 2023పై సోమవారం రాజ్యసభలో మాట్లాడారు. మరోవైపు.. ఆర్టికల్ 370పై అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో విలీనం ఆలస్యం కావడానికి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కారణమని అన్నారు. 370 తాత్కాలిక పరిష్కారమని సుప్రీంకోర్టు అంగీకరించిందని తెలిపారు.…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తమకు వచ్చిన ఓట్లు, సీట్లు చూస్తే రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అధికారం సాధించే దిశలో పయనిస్తుందని తెలిపారు. డబ్బు, మద్యం ప్రభావంను పక్కన పెట్టి ప్రజలు బీజేపీకి విజయాన్ని కట్ట బెట్టారని అన్నారు. బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం…
ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దొంగే దొంగ అన్నట్లు వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోతారు అంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ అదేశాలిస్తున్నా.. కలెక్టర్లు చెత్తబుట్టలో వేస్తున్నారు.. 8 జిల్లాల కలెక్టర్లు అడ్డగోలుగా పని చేస్తున్నారు
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతాయన్నారు. మరి పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారో.. అనేది తెలియదని చెప్పారు. అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించడమే సీఎం జగన్ లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు.
CM KCR: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారంతో ముగియనుంది. ఓటింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.