తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయో మనం చూడొచ్చు అంటూ కేఏ పాల్ తెలిపారు. వచ్చే ఏడాది ఎంపీ స్థానాకి కూడా పోటీ చేస్తానంటూ చెప్పారు. ఇప్పుడుకున్న పార్టీలన్నీ కుల, కుటుంబ పాలనకే మొగ్గు చూపుతున్నాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం.. కావునా ఇప్పటికే అభ్యర్థలను కూడా తొందరలోనే ప్రకటిస్తానంటూ ప్రజాశాంతి చీఫ్ కేఏ పాల్ అన్నారు.
Also Read : Khalistan: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న “ఖలిస్తాన్”
ప్రజాశాంతి పార్టీలో 31 లక్షల మంది జాయిన్ అయినట్లు కేఏ పాల్ వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. జూలై లేదా అగస్టులో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయితే ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. కేసీఆర్ ముందస్తు వెళ్లేందుకు రెండు కారణాలున్నాయని కేఏ పాల్ అన్నారు. రాష్ట్రానికి 25వేల కోట్లు అవసరం ఆ డబ్బు కేసఆర్ దగ్గర లేదు.. ఎందుకంటే తెలంగాణ అప్పుల పాలు అయింది.. దరిద్రం అయిపోయింది.. దాని వల్ల ముందస్తుకు ఎన్నికలకు వెళ్తే లక్ష కోట్ల రూపాయలు మిగులుతాయని కేఏపాల్ వెల్లడించారు. తాను ఖమ్మం లేదా.. సికింద్రాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కేఏ పాల్ వెల్లడించారు.
Also Read : Botsa Satyanarayana: చంద్రబాబు దోపిడీ దొంగ… శిక్ష తప్పదు
9 సంవత్సరాల్లో కేసీఆర్ ఏం చేశారు.. ఆయన ముందుస్తు ఎన్నికలకు ఎప్పుడు వెళ్లిన ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. దళితులతో పాటు అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని ఆయన అన్నారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేయకపోవడం వల్లే అక్కడ టీడీపీ పార్టీ గెలిచిందని కేఏ పాల్ వెల్లడించారు. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ ను చంద్రబాబుకు పరిచయం చేసింది తానే అని ఆయన అన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేసీఆర్ పార్టీలు మోడీకి బీ పార్టీలు కావా అంటూ కేఏ పాల్ ఆరోపించారు. వీళ్లు అన్ని విధాలా మోడీకి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు.