టీడీపీ హయాంలో మాఫియా, మైనింగ్ దోపిడీ జరిగిందన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. శ్రీశైలంలో మంత్రి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ పేరుతో ఇసుకపై కోట్ల రూపాయలు విచ్చలవిడిగా దోపిడీ చేశారు.ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా ఇసుకతో ఎన్నో వందల కోట్లు వస్తున్నాయి చూడమనండి తెలియకుండా ప్రజలలో అప నమ్మకం కలిగిస్తున్నారు.టిడిపి హయాంలో వందల కోట్లు దోచుకుని చినబాబుకి వాటా పెదబాబుకి వాటా వెళ్లిందని ఎమ్మెల్యేలే అప్పట్లో బాహాటంగా చెప్పారు. ఇప్పుడు ఇసుకపై సంవత్సరానికి ఏడు,ఎనిమిది వందల కోట్ల ఆదాయం వస్తుంది. పవన్ ఢిల్లీ వెళ్లిన ఎవ్వరు రానివ్వలేదు నడ్డాతో అవకాశం దొరికింది ఆయన కూడా చెప్పరు చంద్రబాబు బాటలో వెళితే పవన్ జన్మలో ముందుకు పోలేవు అని తేల్చేశారు.
Read Also: Tunisia: మునిగిపోయిన పడవ.. 20 మందికి పైగా వలసదారులు గల్లంతు..
పవన్ ముందు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు తెచ్చుకో ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం చనిపోయింది ప్రజలు నుండి గుర్తింపు కూడా లేదు ఎవ్వరికి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని దించే పరిస్థితి లేదు ప్రజలందరూ జగన్ వెంటే ఉన్నారు మరోసారి జగనే సీఎం అవుతారు. మొన్న పట్టాభిరామ్ మాట్లాడుతూ ట్రైలర్,టీజర్ అన్నాడు గన్నవరంలో చావుతప్పి కన్నులు లొట్టబోయిన పరిస్థితి జరిగిన ఇంకా బుద్ధి రాలేదు. తెలంగాణలో ఓటుకు నోటుతో పారిపోయిన దొంగలు నాలుగురు ఎమ్మెల్యేలను కోట్లతో కొనేసి ఒక్క ఎమ్మెల్సీ గెలిచి ట్రైలర్ అంటున్నారు.
టిడిపికి దమ్ము ధైర్యం ఉంటే ఇంకా సంవత్సరకాలం ఉంది 19 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి గెలవమనండి అప్పుడు చూద్దాం సినిమా అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. నిన్న ఆదోని ఎమ్మెల్యే కూడా జగన్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారు. జగన్ కు మరో అవకాశం ఇస్తే అనుభవ పూర్వకంగా మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు మీరు ఏదో ముక్కలు చేసి కలిపించి చెప్పారు. మే 25న శ్రీశైలంలో జరిగే కుంభాభిషేకానికి సీఎం జగన్ వస్తారన్నారు మంత్రి. మాస్టర్ ప్లాన్ లో భాగంగా క్యూ కాంప్లెక్స్ డిజైన్ అయితే సీఎం జగన్ చేతుల మీదుగా ఫౌండేషన్ వేయించి గ్యాలరీ ఏర్పాటు చేస్తాం అని తెలిపారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
Read Also: IPL 2023 : టీమిండియాలో చోటు కావాలంటే ఎట్లా.. పృథ్వీ షాపై నెటిజన్స్ ఫైర్