ఈ నెల 28వ తేదీ హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతోంది టీడీపీ.భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోనుంది టీడీపీ. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలు, ప్రజా పోరాటాలు, సంస్థాగత పటిష్టతపై కార్యాచరణ సిద్దం చేయనుంది టీడీపీ. తెలంగాణ ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై నిర్ణయం తీసుకోనుంది టీడీపీ. చాలా కాలం తరువాత హైదరాబాదులో పొలిట్ బ్యూరో మీటింగ్ జరగనుండడంతో ఏం చర్చిస్తారనేది హాట్ టాపిక్ అవుతోంది. మేలో జరిగే మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చ జరగనుంది.
Read Also:Cashew Rs.30 Per KG: జీడిపప్పు కిలో 30 రూపాయలు మాత్రమే..!
రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చ – తీర్మానాలు వుంటాయి. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మార్చి 29న హైదరాబాదులో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్సులో జరిగే సభకు హాజరు కానున్న రెండు రాష్ట్రాల టీడీపీ నేతలు. ఏపీ నుంచి సభకు వెళ్లనున్నారు పొలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జ్లు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పార్టీ ఆవిర్భావ సభకు వెళ్లనున్నారు క్లస్టర్ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ నాయకులు.
Read Also: IPL 2023 : ఆర్సీబీకి షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్