ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలెప్పుడు జరిగినా, జగన్ ను వైసీపీని మట్టి కరిపించడానికి టీడీపీ సిద్ధంగా ఉంది.టీడీపీ గురించి మాట్లాడే ముందు, పేర్నినాని వచ్చే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయనంటున్నాడో చెప్పాలి.175 నియోజకవర్గాల్లో వైసీపీ తరుపున బరిలో నిలిచే అభ్యర్థులెవరో చెప్పే దమ్ము, ధైర్యం పేర్ని నానికి, జగన్ కు ఉన్నాయా?పేర్ని నానికి డిపాజిట్లు రావని గతంలోనే చెప్పాను.నానికి దమ్ముంటే, సొల్లు పురాణాలు చెప్పడం మాని ప్రజాక్షేత్రంలో టీడీపీతో తేల్చుకోవాలి.డిపాజిట్లు దక్కవన్న భయంతోనే పేర్నినాని, ధర్మాన, చెవిరెడ్డిలాంటి వాళ్లు పోటీ చేయమంటున్నారు.ప్రజలు జగన్ను, వైసీపీని విశ్వసించడం లేదని ఐప్యాక్ సర్వే తేల్చింది.
ఐప్యాక్ సర్వే చూశాక జగన్ను నమ్మి ఎన్నికల బరిలో నిలవడానికి ఎవరూ సాహసించడం లేదు.అవినీతి కేసులు, బాబాయ్ హత్య కేసు నుంచి బయట పడటానికే జగన్ ఢిల్లీ పర్యటనలు.నాలుగేళ్లల్లో అక్కచెల్లెమ్మల పుస్తెలు తెంపి, మద్యం అమ్మకాలతో రూ. 94 వేల కోట్లు రాబట్టడమేనా జగన్ అమలు చేసిన మద్యపాన నిషేధం..? అని బోండా ఉమా ప్రశ్నించారు.
Read Also: SS Rajaomouli: దసరాపై రాజమౌళి ప్రశంసలు.. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావంటూ నానికి కితాబు