ఏపీ శాసనమండలి స్వరూపం మారనుంది. శాసనమండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది బీజేపీ. శాసనసభలోనూ ఆ పార్టీకి ఒక్క సీటు కూడా లభించలేదు. ఇటు శాసనమండలిలో ఇటీవలి వరకూ ఆ పార్టీ నేత పీవీఎన్ మాధవ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. కనీసం ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో ఎమ్మెల్సీ స్థానం ఒక్కటి కూడా ఆపార్టీకి లేకుండా పోయింది. దీంతో చట్టసభల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రాతినిధ్యం లేదు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వీరిలో అధికార వైకాపా సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 33 నుంచి (గవర్నర్ కోటాలో నామినేట్ అయిన వారితో కలిపి) 44కు చేరుకోనుంది.
Read Also: Revanth reddy: నిరుద్యోగ నిరసనకు పిలుపు.. రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్..
ప్రతిపక్ష తెదేపా సభ్యుల సంఖ్య 17 నుంచి 10కి తగ్గనుంది. పీడీఎఫ్‌కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుంది. భాజపాకు ఉన్న ఒక్క సభ్యుడూ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది..తాజాగా ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2.. మొత్తంగా 21 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో 17 స్థానాలు వైకాపా, 4 స్థానాలు తెదేపా దక్కించుకున్నాయి. టీడీపీరి చెందిన మొత్తం 11 మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరు, మే నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నలుగురు గెలిచారు. ఉత్తరాంధ్ర నుంచి వేపాడ చిరంజీవి రావు, తూర్పు రాయలసీమ నుంచి కంచర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మహిళా నేత, అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ విజయం సాధించడంతో కొత్తగా వీరు శాసనమండలి మెట్లు ఎక్కనున్నారు. వైసీపీకి చెందిన ఏడుగురు సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 17 మంది గెలిచారు.
మండలిలో ప్రస్తుత వివిధ పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం టీడీపీ -10
పీడీఎఫ్- 2
ఇండిపెండెంట్: 1
జులైలో గవర్నర్ కోటాలో భర్తీ కానున్న మరో 2 ఎమ్మెల్సీ స్థానాలతో కలిపి జూలై నాటికి 47కు చేరనుంది వైసీపీ బలం.
Read Also: Mekapati Chandrasekhar Reddy: మేకపాటి మిస్సింగ్.. ఎక్కడికెళ్ళినట్టు?