బద్వేల్ ఉప ఎన్నికకు కూడా అదే షెడ్యూల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల సందడి మొదలైంది… తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానంతో పాటు.. ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇదే షెడ్యూల్ వర్తించనుంది.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక జరుగుతుండగా… ఈ ఎన్నికల్లో తన అభ్యర్థిగా దాసరి సుధాను ప్రకటించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్‌ని బద్వేల్ అభ్యర్థిగా నిర్ణయించింది.. మరి, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా? లేక విడివిడిగా బరిలోకి దిగుతాయా..? అసలు పోటీకే దూరంగా ఉంటాయా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 1వ తేదీన ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 1వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8గా నిర్ణయించారు.. ఇక, అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా.. అక్టోబర్ 30వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ నిర్వహించనున్నారు.. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. మరోవైపు ఉప ఎన్నికలపై కరోనా ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం.. ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం విధించింది.. వెయ్యి మందితోనే సభలకు అనుమతి ఇచ్చింది..
Also Read
తాజావార్తలు
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!