Thummala Nageswara Rao: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో బుధవారం పోలీసులు సోదాలు చేశారు. ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన రెండు నివాసాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు.
Thummala Nageswara Rao: 6 గ్యారెంటీలకంటే నేను ఇంకో పధకం ఇస్తున్న అదే ప్రశాంతమైన ఖమ్మం అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకప్పుడు ఈ కాలనీ నుంచి అర్ధరాత్రి కూడా నీళ్లకోసం ఫోన్ లు వచ్చేవన్నారు.
Postal Vote: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. శుక్రవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది.
No Exit Poll: తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో నవంబర్ 7 నుంచి నవంబర్ 30 వరకు అనేక దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Election commission: రాజకీయ పొత్తులను కమిషన్ నియంత్రించలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 26 ప్రతిపక్ష పార్టీల కూటమికి I.N.D.I.A అని పేరు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టులో కేసు నడుస్తోంది.
డిసెంబర్ 5 వరకు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో తమ ప్రతిపాదిత ‘విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర’ చేపట్టవద్దని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
భారత ఎన్నికల సంఘం గురువారం (అక్టోబర్ 26) నటుడు రాజ్‌కుమార్ రావుకు కీలక బాధ్యతను అప్పగించింది. తన నటనతో అందరినీ ఆకట్టుకున్న రాజ్‌కుమార్‌రావును కమిషన్ జాతీయ ఐకాన్‌గా నియమించింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తరఫున జాతీయ ప్రచారకర్తలుగా వ్యవహరించనున్న నేషనల్ ఐకాన్లలో ఒకరిగా ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు నియమితులయ్యారు.
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న రైతుబంధు పథకాన్ని ఆపేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ పథకాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఏడు సంవత్సరాల నుంచి అమలవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది జగన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్దం అవుతున్న వేళ, కొన్ని విషయాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిక్కచ్చిగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అని ఆయన తెలిపారు.