కాచిగూడలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనదని ఆయన తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో ఎన్నికలు గొప్పగా, పండుగలా జరుపుకుంటామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భద్రత కట్టుదిట్టం చేశామని ఆయన చెప్పుకొచ్చారు.
పాతబస్తీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. మలక్ పేట్, చార్మినార్, యాకుత్ పురా, చంద్రయాన్ గుట్ట, బహదూర్ పురా, కార్వాన్, గోషామహల్ ఏడు నియోజకవర్గాలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. పాతబస్తీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టవంతమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.
Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రేపే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. దీంతో హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాలో పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది ఇప్పటికే డీఆర్సీ కేంద్రాలకు చేరుకున్నారు. వారికి అధికారులు ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అందజేస్తున్నారు. సామాగ్రిని తీసుకుని ఇవాళ సాయంత్రంలోగా సిబ్బంది తమ తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి…
Strict Action will be taken on Organisations working on November 30: నవంబర్ 30వ తేదీన అంటే రేపు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలు ఇంకా గంటల వ్యవధిలోకి వచ్చేయడంతో సర్వత్రా ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఇక నవంబర్ 30వ తేదీన ఎన్నికల సంధర్భంగా సెలవు ప్రకటించాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా, వ్యాపార సంస్థలను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక రేపు ఓటు హక్కు ఉన్న ప్రతి…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఇక, ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది.. మరోవైపు.. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119. బరిలో వున్న అభ్యర్థులు 2,290 మంది. వారిలో మహిళలు 221 మంది కాగా, పురుషులు 2,068 మంది, ఒక ట్రాన్స్ జెండర్. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 2 వేల 799. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య కోటి 62 లక్షల 98 వేల 418. మహిళా ఓటర్లు…
తెలంగాణలో ఎన్నికల సంఘం తొలిసారిగా అమలు చేసిన హోమ్ ఓటింగ్ విధానం విజయవంతమైంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం చాలా బాగా ఉపయోగపడింది. గతంలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయేవారు. ఈ హోమ్ ఓటింగ్ ద్వారా వారంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
రైతు బంధును అనుమతిని ఎన్నికల కమిషన్ రద్దు చేయడంతో బీఆర్ఎస్ ఎంపీ కే. కేశవ్ రావు స్పందించారు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం.. ఇది ఏ పార్టీలకు సంబంధించినది కాదు అని తెలిపారు.
దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే మా పోరాటం కొనసాగుతుంది అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదు.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉంది.