తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణ సంస్థ మేనెజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఓటు హక్కును కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్ లోని 375వ పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి వేశారు. ఈ సందర్భంగా వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని అన్నారు. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఓటు హక్కు చాటుతుంది అని ఆయన చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించుకోవాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, విద్యావంతులు ఓటు వేయడాన్ని తమ బాధ్యతగా భావించి.. పోలింగ్ లో పాల్గొనాలని కోరారు.