రాజేంద్రనగర్ లోని శాస్త్రిపురం వట్టేపల్లిలోని సెంట్ ఫాయజ్ పోలింగ్ బూత్ నంబర్ 400లో తన ఓటు హక్కును ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. శాస్త్రిపురంలో నా ఓటు హక్కు వినియోగించుకున్నాను.. ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారు అన్నది వారి ఇష్టం.. 100శాతం పోలింగ్ లో ఓటర్లు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోండి అని అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ఓటు వేయడం ద్వారా నాయకులపై బాధ్యత మరింత పెరుగుతుంది అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయండి.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఎన్నికల పోలింగ్ లో యువత పాల్గొనాలి.. కనీసం ఓ అరగంట సమయం వెచ్చించి ఓటు హక్కును వినియోగించుకొండి అని ఆయన కోరారు.