తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భద్రత కట్టుదిట్టం చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది.. తెలంగాణ రాష్ట్రంలో 70 వేల మంది పోలీస్ సిబ్బంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హోంగార్డ్ సిబ్బంది, కేంద్ర బలగాలతో బందోబస్త్ ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ పేర్కొన్నారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. నేను నా భార్య ఇద్దరం మా ఓటు హక్కును వినియోగించుకున్నాము.. మీరు కూడా ఓ హక్కును వినియోగించుకోవాలి అని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు.
Read Also: Telangana Elections 2023: క్యూలో నిల్చొని.. ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్!
రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన ఏర్పాట్లు చేశామని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ సిబ్బందితో భరీ బందోబస్తు ఏర్పాటు చేశాం.. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ కొనసాగుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.